Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఉత్కంఠభరితంగా సాగిన 'ది చేజ్'

By:  Tupaki Desk   |   28 Jan 2021 4:37 PM GMT
ట్రైలర్ టాక్: ఉత్కంఠభరితంగా సాగిన ది చేజ్
X
'నిను వీడని నీడను నేనే' ఫేమ్ కార్తీక్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ''ది చేజ్''. రైజా విల్సన్ - యాంకర్ అనసూయ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ మలయాళ హిందీ కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఆపిల్ స్టూడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో ఇదో వైవిధ్యభరితమైన సినిమా అని అర్థం అయింది. ఈ క్రమంలో తాజాగా 'ది చేస్' ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'ఒక జింక మరో జింక పిల్లని కాపాడటానికి ఒక పులితో యుద్ధానికి దిగింది.. పాపం ఆ జింకకి తెలియదు తాను పోరాడుతోంది పులితో కాదు క్రూరమైన తోడేలుతో అని' అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. పూర్తిగా రాత్రి సమయంలో జరిగే సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. దీనికి సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. అలానే సినిమాటోగ్రాఫర్ ఆర్. వేల్ రాజ్ అందించిన నైట్ విజువల్స్ బాగున్నాయి. దిలీప్ సుబ్బరాయన్ స్టంట్స్ కంపోజ్ చేయగా.. సాబు జోసెఫ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్ - మధు నందన్ - సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 'ది చేస్' వివిధ భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.