Begin typing your search above and press return to search.

థియేట‌ర్ క‌ష్టాలపై క్రైసిస్ ని విశ్లేషిస్తే మార్పు ఇదీ

By:  Tupaki Desk   |   22 Sep 2020 3:30 PM GMT
థియేట‌ర్ క‌ష్టాలపై క్రైసిస్ ని విశ్లేషిస్తే మార్పు ఇదీ
X
మ‌హ‌మ్మారీ చాలా మంది జీవితాలను అయోమ‌యంలోకి నెట్టేసింది. అనేక మందిని నిరుద్యోగుల‌ను చేసింది. ముఖ్యంగా సినీరంగం థియేట‌ర్ల రంగం దారుణ ప్ర‌భావాన్ని చ‌వి చూశాయి. ల‌క్ష‌లాది మంది ఉపాధి కోల్పోయాక‌.. కొంద‌రు బ‌తుకు తెరువు లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న వైనం చూస్తున్నాం. థియేటర్లు మూసివేయబడటం చాలా మందికి నష్టాలను తెచ్చిపెట్టినందున చిత్ర పరిశ్రమ ఎక్కువగా క‌ష్ట‌కాలాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

థియేటర్లను మూసివేయడం భయానక అనుభవంగా మార‌డంతో OTT దిగ్గజాలు దానిని పెద్ద మొత్తంలో క్యాష్ చేసుకున్నాయి. OTT బూమ్ మార్కెట్ ను స్వాధీనం చేసుకున్న విధానం ప‌రిశీలిస్తే ఇక‌పై జ‌నం సినీవీక్ష‌ణ‌ విధానాన్ని స‌మూలంగా మార్చేసింద‌న్న అంచ‌నా వెలువ‌డుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో హిందీ తెలుగు భాషలలో చాలా మంది ఎదురుచూసిన‌ చిత్రాలు ఓటీటీలో వచ్చాయి. అదే సమయంలో తమ చిన్న బ‌డ్జెట్ చిత్రాలను డిజిట‌ల్ తెరలపై విడుదల చేయడానికి మంచి అవకాశం లభించడం చోటా నిర్మాత‌ల‌కు వరంగా మారింది. ఎవ‌రికీ థియేట‌ర్ల స‌మ‌స్య అన్న‌దే ఉత్ప‌న్నం కాక‌పోవ‌డం కొత్త ప‌రిణామం.

సాధారణంగా చిన్న సినిమాలు ఎక్కువ థియేటర్లను ద‌క్కించుకోవ‌డం కుద‌ర‌దు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎక్కువ స్క్రీన్ల‌ను ఆక్రమిస్తారు. ఇప్పుడు కరోనా కాలంలో చిన్న నిర్మాతలు డిజిట‌ల్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీయ‌డం అన్న‌ది కొత్త ప‌రిణామంగానూ మారింది. రాబ‌డి త‌గ్గినా పెట్టుబ‌డి సుర‌క్షితం అన్న ధీమా చిన్న నిర్మాత‌ల్లో క‌నిపిస్తోంద‌ట‌.

నిజానికి క్రైసిస్ లేని రోజుల్లోనే ఎగ్జిబిట‌ర్ల‌కు న‌ష్టాలు అన్న ప్ర‌చారం ఉంది. పెద్ద సినిమాలు ఎక్కువ‌గా విడుదల చేయనందున ఇది పరోక్షంగా థియేటర్ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. థియేటర్ యజమానులు నిల‌బ‌డాలంటే చిన్న చిత్రాలను విడుద‌ల‌చేయాలి. చిన్న నిర్మాతలు సినిమాలు చేయనప్పుడు ఓటీటీపై ఆధార‌ప‌డిన‌ప్పుడు థియేటర్ యజమానులకు ఎక్కువ సమస్యలు వస్తాయి.

లాక్ డౌన్ ని విశ్లేషిస్తే బ‌య‌ట‌ప‌డిన నిజాలివి. ఒక విధంగా ఈ ప‌రిణామం చిన్న నిర్మాతలకు వారి చిత్రాలను ఆన్ లైన్ లో విక్రయించడానికి సహాయపడింది. అయితే అదే సమయంలో రాబోయే రోజుల్లో భారీగా పెద్ద తెర‌ స్క్రీన్ల‌లో త‌మ చిత్రాల్ని విడుదల చేయాలనే చిన్న నిర్మాత లక్ష్యాన్ని ఇది చంపుతుంది.