Begin typing your search above and press return to search.
మాస్టర్ క్రేజ్ ముందు కరోనా నిలువలేదు
By: Tupaki Desk | 6 Jan 2021 10:30 AM GMTసూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ లో విడుదల ఉంటుంది. దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లు నమోదు అవుతాయి. కాని ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో థియేటర్ల పరిస్థితి అద్వాన్నంగా ఉంది. కొన్ని చోట్ల థియేటర్లు తెరిస్తే ప్రేక్షకులు రావడం లేదు.. కొన్ని చోట్ల అసలు థియేటర్లు ఓపెన్ కాలేదు. ఇలాంటి సమయంలో మాస్టర్ ను విడుదల చేస్తే ఖచ్చితంగా వసూళ్ల పరంగా దెబ్బ పడటం ఖాయం అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం విజయ్ మూవీ అనే కాకుండా ఏ సినిమా విడుదల అయినా కూడా అదే పరిస్థితి ఉంటుదని అనుకున్నారు. కాని విజయ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే కరోనా అసలు ఉందా లేదా అనిపిస్తుంది.. కరోనా కు ముందు ఏవైతే లెక్కలు విజయ్ సినిమాకు నమోదు అయ్యేవో అవే నమోదు అయ్యాయి.
తమిళనాట 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకునేందుకు అనుమతులు వచ్చాయి. దాంతో సినిమాను అక్కడ ఏకంగా రూ.65 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రూ.10 కోట్లు బిజినెస్ చేసింది. కేరళ మరియు కర్ణాటక కలిపి మరో 10 కోట్ల బిజినెస్ చేసింది. ఉత్తర భారతంలో అయిదు కోట్ల బిజినెస్ చేసిన మాస్టర్ ఓవర్సీస్ లో రూ.15 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ.105 కోట్ల బిజినెస్ ను చేసింది అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కరోనా సమయంలో ఇంత భారీ బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. ఇంత భారీ క్రేజ్ ఉంది కనుకే సినిమాను ఓటీటీకి అమ్మేందుకు నిర్మాతలు ఓకే చెప్పలేదు. సినిమా విడుదలై హిట్ టాక్ దక్కించుకుంటే ఈజీగా 150 కోట్లు వసూళ్లు సాధించడం ఖాయం అంటున్నారు. అప్పుడు నిర్మాతకు లాభాలు మరింత భారీగా ఉంటాయి. మొత్తానికి మాస్టర్ కు ఉన్న క్రేజ్ ముందు కరోనా చిన్న బోయినట్లుగానే కనిపిస్తుంది.