Begin typing your search above and press return to search.
కంగనాను అరెస్ట్ చేయకండి: హైకోర్టు
By: Tupaki Desk | 24 Nov 2020 6:29 PM GMTవివాదాస్పద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ముంబై హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్ట్ చేయవద్దని బాంబే హైకోర్టు మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది.
కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి చందెల్ పై ఇటీవల ముంబై పోలీసుల దేశద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన సిస్టర్స్ సోషల్ మీడియా పోస్టులు, ఇంటర్యూలు ఉన్నాయని క్యాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా సోదరులు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు సమన్లు జారీ చేశారు.
కంగన మాత్రం సినిమా షూటింగ్ లో పాల్గొంటూ విచారణకు హాజరు కాకుండా వాయిదా వేస్తున్నారు. దీంతో పోలీసులు షూటింగ్ లకు వెళ్లే సమయం ఉంటుంది కానీ విచారణకు హాజరయ్యే సమయం ఉండదా అని వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంగన, రంగోలిలను అరెస్ట్ చేసేందుకు పోలీసుల సిద్ధమయ్యారు.
తాజాగా తమపై ఉన్న కేసును కొట్టేసేలా ఆదేశాలను ఇవ్వాలని కంగన, రంగొలీలు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తాము సోషల్ మీడియాలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని, కేవలం తమ ఉద్దేశాలను మాత్రమే వెల్లడించామంటూ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. అంతేగాక పోలీసుల సమన్లను తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే పోలీసులు తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
కంగన వాదనను విన్న హైకోర్టు ముంబై పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని ఇప్పుడే అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అదే విధంగా జనవరి 8న ముంబై పోలీసుల ముందు హాజరుకావాల్సిందిగా కంగన, రంగోలీలను న్యాయస్థానం ఆదేశించింది.