Begin typing your search above and press return to search.
మార్ఫింగ్ చేశారు.. క్లారిటీ ఇచ్చిన కొరియోగ్రాఫర్
By: Tupaki Desk | 11 Oct 2020 1:30 AM GMTప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్ పై చెలరేగిన వివాదంపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. సోనీ చానెల్ లో ప్రసారమవుతున్న ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్’ షోకు న్యాయ నిర్ణేతగా ప్రముఖ కొరియో గ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్, గీతాకపూర్, నటి మలైకా అరోరా వ్యవహరిస్తున్నారు.
కాగా ఇటీవల ఇందులో జడ్జిగా వ్యవహరిస్తున్న నటి మలైక కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో ప్రముఖ్య డ్యాన్స్ మాస్టర్ నోరా ఫతేహి న్యాయమూర్తిగా ఎంట్రీ ఇచ్చింది.
ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్ టెరెన్స్, డ్యాన్సర్ నోరాతో అనుచితంగా ప్రవర్తించాడని వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి స్టేజ్ పై డ్యాన్స్ చేస్తుండగా నోరాను అభ్యంతరకరంగా తాకినట్లు ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా ఈ వీడియోపై టెరెన్స్ లూయిస్ స్పందించాడు. అది అసలైన వీడియో కాదని.. మార్ఫింగ్ చేశారని.. నోరాపై తనకు చాలా గౌరవం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఈ క్లిప్ వాస్తవమైతే నోరా ఎందుకు స్పందించకుండా ఉంటుందని తెలిపాడు. ఆడవాళ్లపై తనకు అమిత గౌరవం ఉందని.. ఇలాంటి చెడు పనులు జీవితంలో చేయనని పేర్కొన్నాడు.