Begin typing your search above and press return to search.
మనోజ్, నేను బిచ్చగాళ్లమయ్యాంః ఆది
By: Tupaki Desk | 4 July 2017 8:06 AM GMTఖాళీ జేబు - ఆకలితో ఉన్న కడుపు, గాయపడ్డ హృదయం నేర్పే పాఠాలు వేరెవరూ నేర్పలేరనేది జీవిత సత్యం. ఊరు కాని ఊర్లో పర్యటిస్తున్నపుడు మన దగ్గర డబ్బులు లేనపుడు నానా అవస్థలు పడాల్పి వస్తుంది. అయితే, ఈ తిప్పలు సామాన్యులకు మాత్రమే పరిమితం అనుకోకండి. సెలబ్రిటీలు సైతం కొన్నిసార్లు జేబులో చిల్లిగవ్వ లేక బిచ్చగాళ్లుగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. విదేశాల్లో ఇద్దరు ప్రముఖ హీరోలకు ఎదురైన చేదు అనుభవమే ఇందుకు నిదర్శనం.
ఆ ఇద్దరు ప్రముఖుల్లో ఒకరు హీరో ఆది పినిశెట్టి కాగా - మరొకరు హీరో మంచు మనోజ్. ఆది ఇటీవల ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన - మనోజ్ ఎదుర్కొన్న ఓ సరదా సంఘటనను పంచుకొన్నారు. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో మోహన్ బాబు నటిస్తున్న చిత్రం షూటింగ్ సందర్భంగా మోహన్ బాబు - రవిరాజా పినిశెట్టి కుటుంబ సభ్యులందరూ ఫ్రాన్స్ వెళ్లారట.
పారిస్ లో ఓ చోట షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరికీ చెప్పకుండా మనోజ్ - ఆది ఓ బస్ ఎక్కి వేరే చోటుకి వెళ్లారట. వారిద్దరూ కొన్ని ప్రదేశాలు తిరిగి షూటింగ్ ప్రాంతానికి చేరుకొనేసరికి యూనిట్ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారట. జేబులో చిల్లిగవ్వ లేక - వారున్న చోటికి ఎలా వెళ్లాలో తెలియక భయపడిపోయారట.
చివరకు దిక్కుతోచని స్థితిలో ఓ బ్రిడ్డి వద్ద టోపీలు ముందు పెట్టుకుని తెలుగు పాటలు పాడామని ఆది తెలిపారు. బస్ చార్జీల కోసం బిచ్చగాళ్లుగా మారిపోయామని చెప్పారు. ఆ పాటలు విని కొంతమంది డబ్బులు వేశారని, ఆ డబ్బులతో బస్ ఎక్కి యూనిట్ సభ్యులను చేరుకున్నామని ఆది గుర్తు చేసుకున్నారు..
సరైనోడు చిత్రం ఆదికి మంచి గుర్తింపు తెచ్చింది. నానితో కలిసి నటించిన చిత్రం నిన్ను కోరి జులై 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఆరు, ఏడు సంవత్సరాలుగా నానితో కలిసి సినిమా చేయాలనుకుంటున్నానని ఆది చెప్పాడు. ఆ సినిమా కథ విని నాని కళ్లల్లో నీళ్లు తిరిగాయని, సహజ నటనతో ఉమామహేశ్వరరావు పాత్రకు నాని ప్రాణం పోశాడని ఆది అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/