Begin typing your search above and press return to search.
స్టార్ ప్రొడక్షన్ కంపనీ సంచలన నిర్ణయం?
By: Tupaki Desk | 26 Aug 2022 12:30 PM GMTటాలీవుడ్ లో వున్న బిగ్ ప్రొడక్షన్ కంపనీల్లో చాలా కొంత మంది ప్రొడ్యూసర్లు మాత్రమే సినిమాలు నిర్మిస్తూ డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ రాణిస్తున్నారు. అందులో నైజాం ఏరియాలో సురేష్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్, గీతా ఆర్ట్స్ నుంచి గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వున్నారు. అయితే నైజాంలో ప్రధానంగా దిల్ రాజు పేరే వినిపిస్తూ వుంటుంది. గత కొన్నేళ్లుగా ఆయనే నైజాం కింగ్ అంటూ చాలా మంది ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కొత్తగా నైజాం లో వరంగల్ శ్రీను పేరు వినిపిస్తోంది. చాలా వరకు భారీ సినిమాలని దిల్ రాజుకు పోటీగా వెళుతూ తనే దక్కించుకుంటున్నాడు. ఇదిలా వుంటే టాలీవుడ్ లో స్టార్ ప్రొడక్షన్ కంపనీగా పేరున్న నిర్మాణ సంస్థ కూడా త్వరలో ఈ నైజాం ఏరియా విషయంలో స్వయంగా పోటీకి దిగుతోందట. టాలీవుడ్ లో చిన్న హీరోల నుంచి మెగాస్టార్ వరకు వరుసగా సినిమాలు నిర్మిస్తున్న టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిన ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.
కిరణ్ అబ్బవరం నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు వరుసగా సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా నిలిచింది. అయితే ఇన్ని సినిమాలు నిర్మిస్తూ మేజర్ నైజాం ఏరియాని మరో డిస్ట్రిబ్యూటర్ కు ఇవ్వడం ఎందుకు మనమే స్వయంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగితే పోలా అని నిర్ణయించుకుందట. ఇదే విషయం ఇటీవల జరిగిన గిల్డ్ భేటీలో బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా గిల్డ్ వివిధ రంగాల కు చెందిన వారితో ప్రత్యేకంగా భేటీలు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా ఎగ్జిబిటర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇక్కడే ఎగ్జిబిటర్ల అసలు రంగు బయటపడినట్టుగా చెబుతున్నారు. డెఫిషీట్ లని కూడా ఖర్చులుగా కొంత మంది చూపిస్తున్నారని చర్చ రావడంతో తాము అలా రాయడం లేదని ఎగ్జిబిటర్లు చెప్పారట. దీంతో మైత్రీ వారికి పట్టరాని కోపం వచ్చిందని, తమ సినిమాలకే డెఫషీట్ లు రాసి ఇప్పడు రాయలేదంటున్నారని మండిపడ్డారట. ఈ విషయంపై వాదోపవాదాలు జరగడంతో ఎగ్జిబిటర్లు ఆ నెపాన్ని దిల్ రాజుపై రుద్దినట్టుగా తెలుస్తోంది.
ఊహించని పరిణామాల మధ్య దిల్ రాజు ఈ విషయంలో అసహనం వ్యక్తం చేశారని, ఏది జరిగినా తననే కార్నర్ చేస్తున్నారని మండిపడ్డారట. దీంతో మైత్రీ వారు ఆవేశంతో మా సినిమాలు మేమే రిలీజ్ చేసుకుంటాం.
మిమ్మల్ని కొనమని ఇక్కడ ఎవరూ అడగలేదనడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయి వ్యవహారం ఎటో వెళుతోందని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారని ఇన్ సైడ్ టాక్. ఈ నేపథ్యంలో మీడియాకు యాడ్స్ కట్ చేయాలనే వాదన తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి దిల్ రాజు అంతా సై అంటే తాను కూడా సై అని చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.