Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ ఫ్యామిలీని వీడని కష్టాలు!
By: Tupaki Desk | 14 Nov 2022 10:30 AM GMTసూపర్ స్టార్ ఫ్యామిలీని కష్టాలు గత కొంత కాలంగా నీడలా వెంటాడుతున్నాయి అనిపిస్తోంది. 'బ్రహ్మోత్సవం', 'స్పైడర్' వంటి సినిమాలతో భారీ డిజాస్టర్ లని ఎదుర్కోవడంతో మహేష్ కొంత ఆందోళనకు గురయ్యాడు. ఆ తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన 'భరత్ అనే నేను' మూవీతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావడమే కాకుండా వెంటనే 'మహర్షి'తో మరో విజయాన్ని
సొంతం చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ తో కలిసి SSMB28లో నటిస్తున్నాడు. సినిమాల పరంగా సక్సెస్ ట్రాక్ లోనే వున్నా మహేష్ ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఆ మధ్య తనకు అత్యంత ఇఫ్టమైన నానమ్మని కోల్పోయిన మహేష్ ఆ విషాదం నుంచి తేరుకునే లోపే విజయనిర్మలని కూడా కోల్పోవాల్సి వచ్చింది.
తన తండ్రి కృష్ణని చూసుకోవడమే కాకుండా ఆయన ఆరోగ్య విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాంటి విజయనిర్మల అనారోగ్యంతో కాలం చేయడంతో సూపర్ స్టార్ ఫ్యామిలీ పెద్ద దిక్కుని కోల్పోయినట్టయింది.
ఇక కొన్ని నెలల క్రితం మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తీవ్ర అనారోగ్య కారణాల వల్ల ఆకస్మికంగా మృతి చెందడం సూపర్ స్టార్ మహేష్ బాబుని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తండ్రి తరువాత మహేష్ బాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి రమేష్ బాబు కావడం, తను అకస్మాత్తుగా మృతి చెందడంతో చాలా వరకు మహేష్ ఆవేదనకు గురయ్యారు. ఈ విషాదం నుంచి కోలుకుంటున్న సమయంలోనే తల్లి ఇందిరా దేవి మృతి చెంది సూపర్ స్టార్ ఫ్యామిలీని తీవ్ర శోక సంద్రంలో ముంచేసింది.
తల్లి మరణం తట్టుకోని మహేష్ బాబు తను నటిస్తున్న సినిమా కు బ్రేకిచ్చేశాడు. విశ్రాంతి కోసం ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లిన మహేష్ ఇటీవలే తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. మహేష్ హైదరాబాద్ చేరుకుని వారం తిరక్కుండానే ఆయన తండ్రి, నటుడు సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురికావడం..ఆయనని సోమవారం ఆసుపత్రిలో చేర్చడం సూపర్ స్టార్ అభిమానుల్ని కలవరానికి గురిచేస్తోంది.
హార్ట్ ఎటాక్ కు గురయ్యే పరిస్థితి వుండటంతో సూపర్ స్టార్ కృష్ణని ఆదివారం అర్థ్ర రాత్రి 2 గంటలకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారని, 20 నిమిషాల పాటు పీసీఆర్ చేసిన తరువాత కృష్ణని ఐసీయూకి తరలించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే వుందని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు సోమవారం మధ్యాహ్నం 1:50 కి విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో స్పష్టం చేశారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వెల్లడించడంతో కృష్ణ, మహేష్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.