Begin typing your search above and press return to search.
విలన్ల కష్టం పైవాడే గుర్తించాలి
By: Tupaki Desk | 6 Nov 2019 1:20 PM GMTవిలన్ల కష్టం పైవాడే గుర్తించాలిటాలీవుడ్ లో విలన్ అవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి. జిమ్ కి వెళ్లి కండలు పెంచితే సరిపోదు. భీకరమైన రూపంతోనే నెగ్గుకురాలేరు. ఆహార్యం పరంగానూ సత్తా చాటాలి. ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ పలికించాలి. అయితే ఇటీవలి కాలంలో వస్తున్న విలన్లు ఈ క్వాలిటీస్ అన్నిటితోనే వస్తున్నారా? అంటే చాలా అరుదు అనే చెప్పాలి. అందరూ సోనూసూద్ లు.. ఆషిశ్ విద్యార్థులు కాలేకపోయినా... కొందరు తమను తాము నిరూపించుకునేందుకు యూనిక్ నెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ కోవకే చెందుతాడు యంగ్ విలన్ శత్రు.
నాని `కృష్ణగాడి వీర ప్రేమగాధ` చిత్రంతో విలన్ గా పరిచయం అయ్యాడు శత్రు. నటించిన తొలి సినిమాతోనే ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత `అరవింద సమేత`లోనూ మంచి అవకాశం దక్కింది. ఆ సినిమాలో నటనకు ప్రశంసలు కురిశాయి. అతడి కంటూ ఓ ప్రత్యేక శైలి ఉంది. నటనతో పాటు డైలాగ్ డెలివరీలోనూ ఈజ్ ఉందని గుర్తింపు దక్కింది. అందుకే ఈ ఉత్సాహంలోనే మరింతగా ఛేంజోవర్ కోసం ట్రై చేస్తున్నాడు.
ప్రస్తుతం శత్రు టాలీవుడ్ సహా సౌత్ లో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉన్నాడు. అందుకోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాడని తాజాగా రివీలైన కొత్త ఫోటోషూట్ చెబుతోంది. ఇంతకుముందుతో పోలిస్తే లుక్ పరంగా చాలా ఛేంజ్ కనిపిస్తోంది. కండలు పెంచి రగ్గ్ డ్ గా కనిపించినా సంథింగ్ క్లాసీ అప్పియరెన్స్ తో కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ మేకోవర్ గురించి ప్రస్తుతం నెటిజనుల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. తెలుగు సినిమాకి ఎప్పుడూ విలన్లు కొదవే. అయితే ఇలాంటి యంగ్ విలన్ల రంగ ప్రవేశం కొంతవరకూ ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి