Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ ఎంట్రీతో పెద్ద సినిమాల డైల‌మా!

By:  Tupaki Desk   |   3 Dec 2021 8:30 AM GMT
ఒమిక్రాన్ ఎంట్రీతో పెద్ద సినిమాల డైల‌మా!
X
ఓవైపు తుఫాన్ లు .. మ‌రోవైపు ఒమిక్రాన్ ఎంట్రీ వ్య‌వ‌హారం గుండెల్లో ద‌డ పుట్టిస్తున్నాయి. ఏపీలో స‌డెన్ స్టార్మ్స్ ప్ర‌వేశం.. డిసెంబ‌ర్ చ‌లికాలంలోనూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. కార‌ణాలు ఏవైనా కానీ టాలీవుడ్ రిలీజ్ ల‌పై ఇవ‌న్నీ తీవ్రంగా ప్ర‌భావం చూపుతున్నాయి. ముఖ్యంగా ద‌క్షిణాఫ్రికా నుంచి ఇండియాకు ప్ర‌పంచ‌దేశాల‌కు దిగుమ‌తి అవుతున్న క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విష‌య‌మై ఆందోళ‌న నెల‌కొంది.

ఇప్ప‌టికే రిలీజైన సినిమాల‌న్నీ సేఫ్ కాగా.. ఇక‌పై రిలీజ్ కానున్న సినిమాల రిలీజ్ తేదీల‌పై మళ్లీ స‌స్పెన్స్ నెల‌కొనే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌పైనే అస‌లు పండ‌గ ఉంది. సంక్రాంతి కానుక‌గా ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రం విడుద‌ల‌వుతోంది. అలాగే రాధేశ్యామ్ .. భీమ్లా నాయ‌క్ లాంటి క్రేజీ సినిమాలు సంక్రాంతికే రిలీజ‌వుతూ హీట్ పెంచాయి. అంత‌కుముందే డిసెంబ‌ర్ 17న పుష్ప .. ఆ త‌ర్వాత గ‌ని.. శ్యామ్ సింగ‌రాయ్ లాంటి క్రేజీ చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. అయితే ఒమిక్రాన్ ఎంట్రీతో పెద్ద సినిమాల నిర్మాత‌లంతా మ‌రోమారు ఆలోచ‌న‌లో ప‌డుతున్నార‌ని కొత్త రిలీజ్ తేదీ గురించి ఆలోచిస్తున్నార‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ఇప్ప‌టికి ఏం జ‌రుగుతోందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఒమిక్రాన్ ఎంట్రీతో సైర‌న్ మోగింది. ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ముంద‌స్తుగా విమానాశ్ర‌యాల్లో స్కూళ్లు కాలేజీల్లో హై ఎలెర్ట్ ప్ర‌క‌టించారు. ఇన్నాళ్లు మాస్కులు లేకుండా తిరిగిన వాళ్లు ఇక‌పై త‌ప్ప‌నిస‌రిగా ప్రోటోకాల్ పాటిస్తున్నారు. మ‌రోవైపు ఒమిక్రాన్ తో ఏమంత ప్ర‌మాదం లేద‌ని .. ఇది డెల్లా వేరియంట్ అంత ప్ర‌మాద‌క‌రం కాద‌న్న ప్ర‌చారం కొంత ఊర‌ట‌. ఒమిక్రాన్ తో ఒళ్లు నొప్పులు త‌ప్ప జ్వ‌రం కానీ తీవ్ర‌మైన ప‌రిస్థితులు ఏవీ ఉండ‌వని మందులు స‌రిగా వాడితే త‌గ్గిపోతోంద‌ని కొంద‌రు డాక్ట‌ర్లు చెబుతున్నారు. అయితే ఈ వైర‌స్ కి వేగంగా వ్యాపించే గుణం ఉంద‌న్న‌ది భ‌యం క‌లిగిస్తోంది. ఈ నెలాఖ‌రుకు కానీ దీని ప్ర‌భావం ఎంత‌? అన్న‌దానిపై క్లారిటీ రాదు.