Begin typing your search above and press return to search.

ఎటూ తేల్చుకోలేని స్థితిలో దర్శక హీరోలు..!

By:  Tupaki Desk   |   1 Dec 2022 8:47 AM GMT
ఎటూ తేల్చుకోలేని స్థితిలో దర్శక హీరోలు..!
X
సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ "లైగర్" చిత్రంతో తన కెరీర్ లోనే భారీ ఫ్లాప్ అందుకున్నాడు. దీంతో వీలైనంత త్వరగా నెక్స్ట్ ప్రాజెక్ట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని, స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే విజయ్ కి పరిస్థితులు సహకరించడం లేదు.

విజయ్ దేవరకొండ "ఖుషి" వంటి రొమాంటిక్ మూవీలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించింది. మేకర్స్ 2022 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకొని, షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు.

అయితే మెజారిటీ భాగం చిత్రీకరణ జరుపుకున్న 'ఖుషి' చిత్రం సమంత ఆరోగ్య పరిస్థితి కారణంగా హోల్డ్ లో పడింది. సామ్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సినిమా పునః ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ మళ్లీ ఎప్పుడు తిరిగి సెట్స్ మీదకు వెళుతుందనే దానిపై క్లారిటీ రావడం లేదు.

మరోవైపు దర్శకుడు శివ నిర్వాణ కూడా "ఖుషి" చిత్రంపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. 'నిన్ను కోరి' 'మజిలీ' వంటి రెండు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శివ.. 'టక్ జగదీష్' సినిమాతో నిరాశ పరిచాడు. డైరెక్ట్ ఓటీటీ రిలీజైన ఈ చిత్రం.. దర్శకుడి ప్రతిష్టను దెబ్బతీసింది.

'టక్ జగదీష్' తర్వాత మళ్లీ ట్రాక్ లోకి రావాలని భావించిన శివ నిర్వాణ.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో "ఖుషి" వంటి రొమాంటిక్ చిత్రాన్ని పట్టలెక్కించారు. విజయ్ దేవరకొండ - సమంత వంటి స్టార్స్ ని బోర్డ్ లోకి తీసుకొచ్చారు కానీ.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.

దీంతో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్న శివ నిర్వాణ ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి. "ఖుషి" సినిమా ఎప్పుడు తిరిగి స్టార్ట్ అవుతుందో తెలియక.. తదుపరి ప్రాజెక్ట్ కు వెళ్ళలేక స్టక్ అయిపోయి ఉన్నాడు.

ఏదేమైనా 'ఖుషి' సినిమా నిలిచిపోవడంతో హీరో విజయ్ దేవరకొండ మరియు డైరక్టర్ శివ నిర్వాణ ఇద్దరూ ప్రస్తుతం షూటింగ్స్ లేకుండా ఖాళీగా ఉన్నారు. సమంత కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే లేదా సమ్మర్ నాటికి సినిమాని రెడీ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.