Begin typing your search above and press return to search.
ప్లీజ్ రెమిడెసివిర్.. కొడుకు కోసం అడిగిన దర్శకుడు
By: Tupaki Desk | 21 April 2021 1:30 AM GMTదేశంలో కరోనా తీవ్రతకు నిదర్శనం ఈ ఘటన. తన కొడుకుకు కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వేళ రెమిడెసివిర్ ఇంజక్షన్ కోసం కాళ్లు అరిగేలా దిరిగిన ఆ దర్శకుడు ఎక్కడా దొరకకపోవడంతో చివరకు సోషల్ మీడియాలో వేడుకున్నాడు. రెమిడెసివిర్ ఇప్పించాలని కోరాడు. దీనికి నెటిజన్లు, ప్రముఖుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.
దేశంలో ఇప్పుడు కరోనా కల్లోలం చోటుచేసుకుంది. రోగులకు ఆస్పత్రుల్లో మందుల కొరత, సరిపడినన్ని బెడ్లు లేక, ఆక్సిజన్ సిలిండర్లు లేక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులకే కాదు.. రాజకీయ నాయకులు, సెలెబ్రెటీలను ఈ బాధ వేధిస్తోంది.
కరోనా చికిత్సలో కీలకమైన రెమిడెసివిర్ ఔషధం ప్రస్తుతం బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోంది. ఈ ఔషధం ఎక్కడా బయట దొరకడం లేదు. రూ.10వేల నుంచి రూ.60వేల వరకు బ్లాక్ లో దీన్ని అమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు హన్సాల్ మెహతా తాజాగా కరోనా బారినపడిన తన కుమారుడి చికిత్స కోసం రెమిడెసివిర్ ఔషధం కావాలని.. తనకు దొరకడం లేదని.. సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో వేడుకున్నారు. ముంబైలోని అంధేరి ఈస్ట్ లోని క్రిటికేర్ ఆస్పత్రిలో తన కొడుకు చికిత్స పొందుతున్నాడని తెలిపాడు. ఒక దర్శకుడికే కరోనా డ్రగ్ దొరకలేదంటే బయట ఆస్పత్రుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దర్శకుడు తన కొడుకు కోసం రెమిడెసివిర్ కావాలని చేసిన పోస్టుకు నెటిజన్లు, ప్రముఖులు అనూహ్యంగా స్పందించారు. పలువురు నెటిజన్లు దర్శకుడికి ఈ డ్రగ్ ఇచ్చేందుకు.. అడ్రస్ తెలిపేందుకు ముందుకు వచ్చారు. కేవలం ఒక గంట వ్యవధిలో దర్శకుడికి కావాలసిని రెమెడిసివిర్ మందు దొరికింది. ఇంత మంది తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు దర్శకుడు.
ఈ సందర్భంగా కొడుకు కరోనా సోకిన బాధలో కరోనా పరిస్థితి దేశంలో దారుణంగా ఉందని.. పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉందని దర్శకుడు హన్సల్ మెహతా విమర్శలు గుప్పించారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ పలువరు హితవు పలికారు.