Begin typing your search above and press return to search.
దర్శకుడికే తన సినిమా టికెట్ దొరకలేదు..!
By: Tupaki Desk | 12 Sep 2022 9:44 AM GMTయువ హీరో శర్వానంద్ నటించిన "ఒకే ఒక జీవితం" సినిమా గత శుక్రవారం థియేటర్లలో విడుదలై, అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. శ్రీ కార్తీక్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా.. మంచి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
'ఒకే ఒక జీవితం' సినిమా డీసెంట్ కలెక్షన్స్ తో విజయవంతంగా ఫస్ట్ వీకెండ్ ను పూర్తి చేసుకుంది. మూడో రోజు వసూళ్ళు మొదటి రెండు రోజుల కంటే అధికంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్స్ తో ప్రదర్శించబడినట్లు తెలుస్తోంది.
అయితే 'ఒకే ఒక జీవితం' డైరెక్టర్ శ్రీ కార్తీక్ ఆదివారం హైదరాబాద్ ముసాపేటలోని లక్ష్మీకళ - చంద్రకళ థియేటర్‌లని సందర్శించాడు. బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ అడగ్గా.. షో ఇప్పటికే హౌస్ ఫుల్ గా ఉందని.. ఒక్క టికెట్ కూడా లేదని కౌంటర్ లోని వ్యక్తి చెప్పాడు. దీంతో కార్తీక్ తాను ఈ సినిమా డైరెక్టర్ ని చెబుతూ.. సంతోషంతో వెనుదిరిగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
డైరెక్టర్ శ్రీ కార్తీక్ కే మూడో రోజు కూడా తన సొంత సినిమా టికెట్ దొరకలేదంటే.. 'ఒకే ఒక జీవితం' చిత్రానికి ప్రేక్షకులు సినీ ప్రేమికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజమైన బ్లాక్ బస్టర్ కి ఇదే నిర్వచనంగా చెప్పొచ్చు.
కాగా, 'ఒకే ఒక జీవితం' చిత్రాన్ని టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఫీల్ గుడ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు శ్రీ కార్తీక్. యునిక్ స్టోరీతో హానెస్ట్ మేకింగ్ - ఆకట్టుకునే కథనం మరియు అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాని రూపొందించారు. తమిళ్ లో ఈ సినిమా 'కణం' పేరుతో తెరకెక్కించబడింది.
'ఒకే ఒక జీవితం' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో.. దర్శకుడు శ్రీ కార్తీక్ ఒక్క సినిమాతోనే ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో అందరి దృష్టిని ఆకర్షించాడని చెప్పాలి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించాడు.
ఇందులో శర్వానంద్ అద్భుతమైన నటన కనబర్చగా.. ఆయన తల్లిగా అమల అక్కినేని మెప్పించారు. రీతూ వర్మ హీరోయిన్ గా.. వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - నాజర్ తదితరులు ఇతర పాత్రలతో ఆకట్టుకున్నారు.
జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సంభాషణలు రాశారు. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్ చేయగా.. ఎన్ సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.