Begin typing your search above and press return to search.
రానా ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్ లకు డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!
By: Tupaki Desk | 16 Sep 2022 6:30 AM GMTదర్శకధీరుడు రాజమౌళి అందించయిన 'బాహుబలి' ఎంతో మంది కలల ప్రాజెక్ట్ లకు ప్రాణం పోసేలా చేసింది. భారీ బడ్జెట్, భారీ కాన్వాస్ తో చేసే సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఖచ్చితంగా ఆదరణ వుంటుందని, మార్కెట్ పరిధి కూడా భారీ స్థాయిలో పెరుగుతుందని ఈ సీరిస్ నిరూపించింది. దీంతో చాలా కాలంగా భారీ స్థాయిలో పీరియాడిక్, మైథలాజికల్ కథల్ని తెరపైకి ఎక్కించాలని కొన్నేళ్లుగా కలలు కంటున్న మేకర్స్ తమ కలల ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టడం మొదలు పెట్టారు.
అలా గుణశేఖర్ తెరపైకి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ 'రుద్రమదేవి'. ఎన్నో ఏళ్లుగా తెరపైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేసిన ఆయన ఎట్టకేలకు 2015లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణతో గుణశేఖర్ లో కొత్త ఆలోచన పుట్టింది.. అదే 'హిరణ్యకశ్యప'. మైథలాజికల్ డ్రామాగా శ్రీలక్ష్మీనరసింహాస్వామి కథతో ఈ మూవీని హాలీవుడ్ టెక్నీషియన్ లతో ఫారిన్ కంపనీల భాగస్వామ్యంలో రానా హీరోగా తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారు.
అమెరికాలో దాదాపు రెండేళ్ల పాటు సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి గుణశేఖర్ హాలీవుడ్ సినిమాల తరహాలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. ఫైనల్ గా అంతా పూర్తయిపోవడంతో 2020లో సెట్స్ పైకి వెళ్లాలని ప్లాన్ చేశారు. దీని గురించి ప్రతీ మీడియా ఇంటరాక్షన్ లోనూ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు వెల్లడిస్తూ వచ్చారు. సినిమా హాలీవుడ్ సినిమాల స్థాయిలో వుంటుందని, దీని కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే రెండుళ్ల సమయం తీసుకున్నామని పలు ఆసక్తికర అంశాలని వెల్లడించారు.
అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ కు కరోనా పెద్ద విలన్ గా మారింది. కోవిడ్ ప్రబలడంతో ప్లాన్ మొత్తం తలకిందులైంది. ఈ నేపథ్యంలో గుణశేఖర్ ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుడి ప్రేమ కావ్యాన్ని 'శాకుంతలం' పేరుతో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించి షాకిచ్చాడు. సమంత టైటిల్ పాత్రలో సినిమా పట్టాలెక్కడంతో అంతా రానాతో గుణశేఖర్ చేయాలని తలపెట్టిన 'హిరణ్య కశ్యప' ఇక లేనట్టే అనే వార్తలు వినిపించడం మొదలైంది.
అయితే దీనిపై గుణశేఖర్ స్పందించకపోవడం, సోషల్ మీడియా వేదికగా కూడా ఆ వార్తలని ఖండించకపోవడంతో 'హిరణ్య కశ్యప' చేతులు మారిందంటూ మరిన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. మరో దర్శకుడికి సురేష్ బాబు, రానా ఈ ప్రాజెక్ట్ ని అప్పగించారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే తాజాగా ఈ వార్తలపై, 'హిరణ్య కశ్యప'ప్రాజెక్ట్ పై స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. 'ప్రతీ ఒక్కరికీ ప్రేమతో కూడిన విభిన్నమైన కథగా 'శాకుంతలం'ను అందించడానికి సిద్ధంగా వున్నానని చెప్నుకొచ్చారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా తుది మెరుగులు దిద్దుకుంటోందని, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్వరలోనే అందరిని కలవాలని ఎదురుచూస్తున్నానన్నారు. 'హిరణ్యకశ్యప'తో నరిసింహా అవతారాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తానని ప్రామిస్ చేశాను. ఆ ప్రామిస్ ప్రకారమే ఈ ప్రాజెక్ట్ ని మాసీవ్ స్కేల్ లో భారీ సంస్థలతో కలిసి తెరపైకి తీసుకురాబోతున్నానని గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్ లకు చెక్ పెట్టడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.