Begin typing your search above and press return to search.

క‌థాలోపంతో ఫ్లాపైతే ద‌ర్శ‌కుడు ఫెయిలైన‌ట్టు కాదు!- శ్రీ‌కాంత్ అడ్డాల‌

By:  Tupaki Desk   |   19 July 2021 4:29 PM GMT
క‌థాలోపంతో ఫ్లాపైతే ద‌ర్శ‌కుడు ఫెయిలైన‌ట్టు కాదు!- శ్రీ‌కాంత్ అడ్డాల‌
X
విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మాస్ యాక్ష‌న్‌ ఎంట‌ర్‌టైన‌ర్ `నార‌ప్ప‌`. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ అసుర‌న్ కి రీమేక్ ఇది. డి. సురేశ్‌బాబు- కలైపులి యస్‌.థాను నిర్మించారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఈ సినిమా థియేట‌ర్ రిలీజ్ ని స్కిప్ కొట్టింది. ర‌క‌ర‌కాల డైల‌మాల అనంత‌రం ఓటీటీకి లైన్ క్లియ‌ర్ చేసుకుని వ‌స్తోంది. ఈ నెల 20 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ప్ర‌పంచ దేశాల్లో ఇది తెలుగు ఆడియెన్ కి అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన విశేషాలు..

కొన్నిటిని మార్చ‌కూడ‌దు..!

హిస్ట‌రీలో కొన్ని మంచి చిత్రాల‌ను ట‌చ్ చేసేప్పుడు వాటిని మార్చ‌కూడ‌దు.. క‌థ‌ను డిస్ట్ర‌బ్ చేయ‌కూడదు. అసుర‌న్ లో ఎమోష‌న్ ఏమాత్రం నారప్ప‌లో మిస్ కాకుండా జాగ్ర‌త్త ప‌డ్డాను. అలాగే తెలుగు ప్రేక్షకులు అభిరుచికి అనుగుణంగా కొన్ని చిన్న మార్పులు చేశాను.

50రోజుల షెడ్యూల్ వేశాం:

ఈ సినిమా షెడ్యూల్స్ కోసం చాలా ప్ర‌ణాళిక‌లు వేయాల్సి వ‌చ్చింది. కోవిడ్ వ‌ల్ల అంతా డిస్ట్ర‌బ్ అయ్యింది. అలాగే 50 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ని తెర‌కెక్కించాం. నేటివిటీ ట‌చ్ కోసం అనంతపురంలో దాదాపు 10 రోజుల షూటింగ్ చేశాం. ఇక మిగిలిన ప్ర‌ధాన భాగాన్ని అసుర‌న్ తెర‌కెక్కించిన లొకేష‌న్ల‌లోనే పూర్తి చేశాం.

ఒరిజిన‌ల్ ఫీల్ పోకూడ‌ద‌ని..!

త‌మిళంలో విజ‌యం సాధించిన అసుర‌న్ చూశాక తెలుగు వెర్ష‌న్ క‌థా చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఈ చ‌ర్చ‌ల్లో భాగంగా నిర్మాత సురేష్ బాబు గారిని ద‌ర్శ‌కుడిగా ఎవ‌రిని అనుకున్నారు? అని అడిగాను. ఎవ‌రినీ అనుకోలేద‌ని చెప్పాక‌.. నాకు ఆస‌క్తి ఉంద‌ని తెలిపాను. ఆ త‌ర్వాత చెన్నైలో క‌ళైపులి ఎస్.థానుని క‌లిసాము..అక్క‌డ ఓకే అయ్యాక సినిమా మొద‌లైంది.

రీమేక్ పెద్ద‌ సాహ‌సం.. రిస్క్ కూడా:

రీమేక్ చేయ‌డం అంటే చాలా పెద్ద రిస్కు. ఏం తేడా తీసినా చెడ‌గొట్టార‌ని అంటారు. నార‌ప్ప‌లో ఎమోష‌న్ మిస్స‌వ్వ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా తీయాల్సి వ‌చ్చింది. ఒరిజినల్ ఫీల్ పోకుండా జాగ్ర‌త్త ప‌డ్డాను. ఇక రీమేక్ అంటే క‌థ ఒక్క‌టే ఉంటుంది. మిగ‌తా క‌ష్టం అంతా అలానే ఉంటుంది. దానికోసం చాలా జాగ్ర‌త్త ప‌డాలి. ఎమోష‌న్ మిస్ కాకుండా చేయ‌డం ఈ సెన్సిబుల్ సినిమాలో నాకు బిగ్ ఛాలెంజింగ్ గా నిలిచింది.

వెంకీ నిరాశ‌కు గుర‌య్యారు:

థియేట‌ర్ల‌కు త‌గ్గ‌ట్టు ఈ సినిమాని తెర‌కెక్కించినా ఓటీటీల్లో రిలీజ్ చేయాల్సి వ‌స్తున్నందుకు వెంకీ స‌హా టీమ్ అంతా బాధ‌ప‌డ్డాం. వెంకీ నిరుత్సాహ‌ప‌డ్డారు. ఈ సినిమా కోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డారు. నారప్ప పాత్రలో వెంకటేశ్ గారు పరకాయప్రవేశం చేశారు. పాత్రను ఓన్‌ చేసుకుని చేశారు. సుందరమ్మ పాత్రలో ప్రియమణి బాగా న‌టించారు. ఈ సినిమా నాకు మంచి అనుభ‌వం. వేట్రి స‌ర్ ని అభినందించాలి.

అది ద‌ర్శ‌కుడి ఫాల్ట్ కాదు:

కథలో లోటుపాట్లు ఉండి ప్రేక్ష‌కులు కనెక్ట్‌ కాకపోతే సినిమా ఫెయిల్‌ అవుతుంది కానీ ద‌ర్శ‌కుడు కాదు. నాకు కెరీర్ ప‌రంగా గ్యాప్ వ‌చ్చింది. కోవిడ్ వ‌ల్ల అది ఇంకొంచెం పెరిగింది.. నా త‌దుప‌రి చిత్రం `అన్నా య్‌` ని 3 భాగాలుగా తీస్తాను. ఎవ‌రైనా స్టార్ హీరో అవ‌స‌రం..

అన్నాయ్ 3 భాగాలుగా చేస్తాను!

అన్నాయ్ పీరియాడికల్ చిత్రం. 1970- 1980 నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. క‌థ బాగా కుదిరింది చేస్తున్నాను. ఇక ఓటీటీ డిజిట‌ల్లో అవ‌కాశాలు బావున్నాయి. నేను కూడా చేస్తాను... అని ఇంట‌ర్వ్యూ ముగించారు.