Begin typing your search above and press return to search.
టీజర్: సరికొత్త సిరీస్ తో వచ్చిన 'స్కామ్ 1992' డైరెక్టర్..!
By: Tupaki Desk | 9 Sep 2022 4:48 AM GMT'స్కామ్ 1992' భారతదేశంలో అత్యుత్తమ వెబ్ సిరీస్ లలో ఒకటిగా పరిగణించబడుతుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ కు.. ఓటీటీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అలానే ఎన్నో అవార్డులు సొంత చేసుకుంది.
1992 సంవత్సరంలో దేశాన్ని కుదిపేసిన సెక్యూరిటీస్ స్కామ్ నేపథ్యంలో.. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా పాల్పడిన ఆర్థిక నేరాల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. అన్ని ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ చేయబడిన ఈ సిరీస్.. తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.
'స్కామ్ 1992' సిరీస్ తో సంచలనం సృష్టించిన బాలీవుడ్ ఫిలిం మేకర్.. ఇప్పుడు ''లూటెరే'' (Lootere) అనే ఆసక్తికరమైన సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హన్సల్ మెహతా నేతృత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ కు ఆయన కుమారుడు జై మెహతా దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా 'లూటెరే' సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను మేకర్స్ విడుదల చేసారు. ఇది దురాశ - మనుగడ - టెర్రర్ లతో కూడిన ఒక భయంకరమైన థ్రిల్లర్ సిరీస్ అని హామీ ఇస్తోంది. అంతేకాదు సోమాలియా జలాల్లో హైజాక్ చేయబడిన ఒక భారతీయ ఓడ కథను విస్తరిస్తోంది.
ఇందులో వివేక్ గోంబర్ - దీపక్ తిజోరి - రజత్ కపూర్ - చందన్ రాయ్ సన్యాల్ మరియు అమృతా ఖాన్విల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ విషయానికొస్తే.. సముద్రంలో పడవ లాంగ్ షాట్ తో ఓపెన్ అవ్వగా.. రజత్ కపూర్ ఓడలో బైనాక్యులర్ పట్టుకుని కనిపించాడు. వారు హైజాక్ చేయబడి ఉన్నారు. ఈ క్రమంలో ఏర్పడే గందరగోళ పరిస్థితులు.. వైలెన్స్ ను ఇందులో చూడొచ్చు.
ఈ టీజర్ గ్లిమ్స్ వెబ్ సిరీస్ తెరవెనుక ఒక స్నీక్ పీక్ ను ఇస్తుంది. ఇందులో 'లూటెరే' కోసం సెట్స్ లో వర్క్ చేస్తున్న హన్సల్ మెహతాని మనం గమనించవచ్చు. ఈ సిరీస్ కు జై మెహతా - వైభవ్ విశాల్ - విశాల్ కపూర్ మరియు సుపర్ణ్ వర్మ సహ రచయితగా ఉన్నారు. కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శైలేష్ ఆర్ సింగ్ ఈ సిరీస్ ను నిర్మించారు.
'లూటెరే' సిరీస్ అతి త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా హన్సల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో టీజర్ ను షేర్ చేస్తూ.."జై మెహతా దర్శకత్వం వహించిన #Lootere ని ప్రెజెంట్ చేయడం గర్వంగా ఉంది. ఇది దురాశ, మనుగడ, భీభత్సం మరియు గందరగోళం యొక్క కథ. డిస్నీ + హాట్ స్టార్ లో త్వరలో వస్తుంది'' అని రాసుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.