Begin typing your search above and press return to search.
ఫ్లాప్ సినిమా దర్శకుడికి హిట్ సినిమా రీమేక్ బాధ్యతలు
By: Tupaki Desk | 10 May 2023 8:00 AM GMTటాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మ రూపొందించిన సినిమాలు కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోకున్నా కూడా దర్శకుడిగా మంచి మార్కులు దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు. అందుకే ఆయనకు ఫ్లాప్ దర్శకుడు అని పేరు పడ్డా కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. తాజాగా మరో సినిమాకు రమేష్ వర్మ రెడీ అవుతున్నాడట.
రవితేజ తో రూపొందించిన ఖిలాడీ సినిమా పై దర్శకుడు రమేష్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. విభిన్నమైన సినిమా అంటూ పేరు దక్కించుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. అందుకే రమేష్ వర్మ తదుపరి సినిమా ను వెంటనే చేయకుండా కాస్త గ్యాప్ తీసుకున్నాడు.
తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి హిందీ సూపర్ హిట్ చిత్రం భూల్ భులయ్యా 2 రీమేక్ ను చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో వరుసగా డిజాస్టర్స్ పడుతున్న సమయంలో భూల్ భులయ్యా సినిమా మంచి వసూళ్లు సాధించి మొత్తం హిందీ సినిమా పరిశ్రమకు బూస్ట్ ను ఇచ్చిన విషయం తెల్సిందే.
తెలుగు లో కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకునే కంటెంట్ ఉందని.. అందుకే తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆ సినిమా యొక్క రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగిందట.
రమేష్ వర్మ రూపొందించిన హిట్ సినిమా రాక్షసుడు రీమేక్ అనే విషయం తెల్సిందే. అందుకే రీమేక్ బాధ్యతలు రమేష్ వర్మ కు అప్పగిస్తే తప్పకుండా న్యాయం చేస్తాడనే ఉద్దేశ్యంతో ఆ హిందీ సినిమా యొక్క రీమేక్ బాధ్యతలను రమేష్ వర్మ చేతిలో పెట్టేందుకు సిద్ధం అయ్యారని వార్తలు వస్తున్నాయి.
హీరో ఎవరు అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. పలువురు యంగ్ హీరోలను సంప్రదిస్తున్నారని.. త్వరలోనే ఒక హీరోతో కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ఏడాదిలోనే రీమేక్ పనులను మొదలు పెట్టి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారని తెలుస్తోంది. రమేష్ వర్మకు ఈ సినిమా మరో విజయాన్ని తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.