Begin typing your search above and press return to search.
చావు కబురు చల్లగా కాపీ విమర్శలపై దర్శకుడు స్పందన
By: Tupaki Desk | 21 March 2021 12:30 PM GMTకార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా వచ్చిన 'చావు కబురు చల్లగా' సినిమా కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మూవీ అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా వసూళ్ల విషయం పక్కన పెడితే విడుదల తర్వాత ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కు కాపీ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాపీ వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి కాపీ విమర్శలపై క్లారిటీ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఈ సినిమా కాపీ అంట కదా అంటూ ప్రశ్నించడంతో కౌశిక్ స్పందిస్తూ.. ముందుగా మీరు వెళ్లి సినిమా ను చూడండి. ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే అప్పుడు నన్ను స్టోరీ రిజిస్ట్రర్ డేట్ ను అడగండి. టైమ్ మరియు ఇయర్ ను నేను స్టాంప్ తో సహా చూపిస్తాను అంటూ చాలా గట్టిగా కథ తనదే అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. చావు కబురు చల్లగా సినిమాలో హీరో శవాల బండి నడిపే వ్యక్తి. అతడు ఒక రోజు చావు ఇంటికి వెళ్లి చనిపోయిన వ్యక్తి భార్యను చూసి ప్రేమలో పడతాడు. ఈ కాన్సెప్ట్ తో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ జత చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. దాన్ని కాపీ అంటూ కామెంట్స్ రావడంతో దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఇప్పటికి అయినా విమర్శలు ఆగేనా చూడాలి.