Begin typing your search above and press return to search.

చీదరించుకున్న వాళ్లే స్వాగతం చెప్పేలా చేసింది

By:  Tupaki Desk   |   31 Jan 2022 3:16 AM GMT
చీదరించుకున్న వాళ్లే స్వాగతం చెప్పేలా చేసింది
X
రవితేజ ఖిలాడి సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న ముద్దుగుమ్మ డింపుల్‌ హయతి. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు గద్దల కొండ గణేష్‌ సినిమాలోని ఐటెం సాంగ్ తో పరిచయం అయ్యింది. ఆ సమయంలోనే ఈ అమ్మడి పై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. అయితే ఈ అమ్మడి రంగు తక్కువ అవ్వడం వల్ల.. మిల్కీ బ్యూటీ మాదిరిగా మెరిసి పోయేంత తెలుపు డింపుల్‌ కాదు. దాంతో చాలా మంది అవకాశాల కోసం అడిగిన సమయంలో చీదరించుకునే వారట.

ముఖ్యంగా కెరీర్‌ ఆరంభంలో ఎంత మంది ఫిల్మ్‌ మేకర్స్ ను కలిసినా కూడా నీ కలర్ తక్కువ ఉందంటూ కొందరు మొహం మీదే చెప్పేవారట.. కొందరు పక్కకు వెళ్లిన తర్వాత కలర్ గురించి మాట్లాడుకునే వారట. దాంతో నేను హీరోయిన్ గా పనికి రానేమో అనుకున్నాను. ఆ సమయంలో నాకు గద్దలకొండ గణేష్ సినిమాలో మంచి ఛాన్స్ దక్కింది.

గద్దలకొండ గణేష్ సినిమాలో పాట తర్వాత చాలా మంది ఐటెం సాంగ్స్ తో సంప్రదించారు. కాని ఐటెం సాంగ్స్ చేస్తే పూర్తిగా వాటికే పరిమితం అవ్వాల్సి వస్తుందేమో అని నేను చాలా ఐటెం సాంగ్స్ ను తిరష్కరించాను. నా ప్రయత్నాలు కొనసాగించాను. హీరోయిన్ గా నటించాలనే నా పట్టుదల ముందు నా కలర్‌ విషయం వెనక్కు వెళ్లింది. కలర్‌ తో సంబంధం లేకుండా ప్రతిభతో నాకు అవకాశాలు ఇచ్చేందుకు కొందరు ఫిల్మ్‌ మేకర్స్ ఓకే చెప్పారు. దాంతో నేను ఇప్పుడు హీరోయిన్ గా ఖిలాడి సినిమా తో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాను అంటూ డింపుల్‌ హయతి ఆనందంతో ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసింది.

ఇండస్ట్రీలో కలర్ కాస్త తక్కువ ఉంటే ముఖ్యంగా అమ్మాయిలు కలర్ తక్కువ ఉంటే కనీసం పరిగణలోకి కూడా తీసుకోని జనాలు ఉన్నారు. కాని కొందరు మాత్రం ప్రతిభ ఆధారంగా సినిమా ఆఫర్లు ఇచ్చే వారు కూడా ఉన్నారు. అందుకే డింపుల్‌ హయతి వంటి కాస్త కలర్‌ తక్కువ ఉన్న అమ్మాయిలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. డింపుల్‌ హయతి ముందు ముందు కూడా కలర్‌ వివక్ష ఎదుర్కోవాల్సి రావచ్చు.

అయితే ఆమె సక్సెస్ లు ఆ వివక్ష కు సమాధానం గా నిలవాలి. ఆమె హీరోయిన్ గా ఖిలాడి తో సక్సెస్ ను దక్కించుకుని మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్‌ దక్కితే చీదరించుకున్న వాళ్లే స్వాగతం పలికి ఆఫర్లు ఇచ్చేందుకు క్యూ లో నిల్చుంటారు. అలా డింపుల్ హయతి చేసుకుంటుందని.. ఆమె పట్టుదల అలాంటిది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.