Begin typing your search above and press return to search.
తీవ్ర అస్వస్థత..మళ్లీ ఆస్పత్రిలో చేరిన విజయ్ కాంత్!
By: Tupaki Desk | 7 Oct 2020 9:50 AM GMTతమిళ సినీ నటుడు , డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్య సమస్యలతో మరోసారి హాస్పిటల్ లో చేరారు. గత నెల 22న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు కరోనా సోకిందని తేల్చారు. దీనితో అయన కరోనా చికిత్స తీసుకోవడానికి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు . ఆ తరువాత అయన భార్యకి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమె కూడా చికిత్స కోసం హాస్పిటల్ లో చేరారు. అనంతరం చికిత్స తీసుకొని కోలుకున్నాక ఇద్దరు ఈ నెల 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అయితే మంగళవారం సాయంత్రం మరోసారి విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చేరారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వదంతులు వస్తున్నాయి. ఈ తరుణంలో విజయ్ కాంత్ ఆరోగ్యంపై డీఎండీకే పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న విజయ్‌కాంత్, తదుపరి ఆరోగ్య పరీక్షల నిమిత్తం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. విజయ్ కాంత్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి అని ప్రకటనలో తేల్చారు.