Begin typing your search above and press return to search.

2022 ముగింపు ఇంట్రెస్టింగ్!

By:  Tupaki Desk   |   13 Nov 2022 8:30 AM GMT
2022  ముగింపు ఇంట్రెస్టింగ్!
X
ఏడాది ఆరంభంలోనే టాలీవుడ్ జోరందుకుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` నిరుత్సాహ‌ప‌రిచిన‌ప్ప‌టికీ అటుపై రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్`.. పుష్ప‌-2 మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. అటుపై `సీతారామం`..`బింబిసార` లాంటి చిత్రాలు ఆ వేగాన్ని కొన‌సాగించాయి. మ‌ధ్య‌లో `ఆచార్య` నిరాశ ప‌రిచినా ఆ ప్ర‌భావం ప‌రిశ్ర‌మ‌పై అంత‌గా ప‌డ‌లేదు.

వ‌రుస విజ‌యాల్లో ఒక ప‌రాజ‌యం కొట్టుకుపోయింది. ఇక చివ‌రిగా పాన్ ఇండియా కేట‌గిరిలో రిలీజ్ అయిన `కార్తికేయ‌-2` ఎలాంటి అంచ‌నాలు లేకుండానే పాన్ ఇండియాని షేక్ చేసింది. అయితే ఈ హిట్ త‌ర్వాత మ‌ళ్లీ ఒక్క‌సారిగా డ‌ల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `గాడ్ ఫాద‌ర్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ ప‌ర్వాలేద‌నిపించింది త‌ప్ప బాక్సాఫీస్ రేసులో అంత ఊపు క‌నిపించ‌లేదు.

నాగార్జున `ది ఘోస్ట్`....స‌హా చిన్నా చిత‌కా సినిమాలు చెప్పుకోద‌గ్గ విజ‌యాలు సాధించ‌లేదు. దీంతో 2022 ముగింపు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏడాది చివ‌రికి చేరుకోవ‌డంతో ముగింపు ఎలా ఉంటుంది? అన్న ఎగ్జైట్ మెంట్ సినీ అభిమానుల్లో మొద‌లైంది. ముఖ్యంగా మూడు సినిమాలపై అంచ‌నాలు క‌నిపిస్తున్నాయి. అల్ల‌రి న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం`..`హిట్ -2`..డిసెంబ‌ర్ లో రిలీజ్ అవుతోన్న `ధమాకా`..`లాఠీ` లాంటి చిత్రాల‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

న‌రేష్ సోలో సక్సెస్ అందుకుని చాలా కాల‌మ‌వుతోన్న నేప‌థ్యంలో మారేడు మిల్లిపై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. అలాగే స్ప‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ `హిట్` భారీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో రెండ‌వ భాగంపై అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక ర‌వితేజ వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. దీంతో యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `ధ‌మాకా`తో సాలిడ్ హిట్ అందుకుని న్యూయ‌ర్ లోకి అడుగుపెట్టాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు.

ఇక విశాల్ `లాఠీ`పై చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. ఇంకా కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ రేసులో ఉన్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాల‌కు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు నోచుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో చిన్న సినిమాల్ని త‌క్కువ అంచ‌నా వేడ‌యానికి లేదు. సైలెంట్ గా రిలీజ్ అయి పాన్ ఇండియానే షేక్ చేస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.