Begin typing your search above and press return to search.
టైటిల్ వివాదంలో సుధీర్ బాబు 'హంట్'..!
By: Tupaki Desk | 18 Oct 2022 5:30 PM GMTనైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ''హంట్''. 'గన్స్ డోన్ట్ లై' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమాకు సంబంధించిన క్యారక్టర్ పోస్టర్స్ - టీజర్ మరియు 'పాపతో పైలం' ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ చుట్టూ వివాదం తలెత్తడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
''హంట్'' చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ తనదేనంటూ తాజాగా యువ నటుడు, దర్శకుడు నిక్షిత్ ఆరోపించాడు. ఎం.ఎస్. ఆర్ట్స్ - శ్రీ క్రియేషన్స్ బ్యానర్స్ పై మూడు నెలల క్రితమే ఆ పేరును ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించామని పేర్కొన్నారు.
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ 'హంట్' టైటిల్ పై హక్కులు తమకే ఇచ్చిందని నిక్షిత్ తెలిపారు. అయితే సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమాకు అదే టైటిల్ పెట్టి టీజర్ - సాంగ్ ను రిలీజ్ చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఫిలిం చాంబర్ కు ఫిర్యాదు చేశామని చెప్పాడు.
గతంలో 'హంట్' రిజిస్టర్ అయినందున టైటిల్ మార్పును పరిశీలించాలన్న ఫిల్మ్ ఛాంబర్ సూచనకు కూడా భవ్య క్రియేషన్స్ పట్టించుకోవడం లేదని నిక్షిత్ అన్నారు. ఇది తన సొంత ప్రొడక్షన్ కు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని వాపోయాడు. సుధీర్ బాబు సినిమా టైటిల్ మార్చుకునేలా ఛాంబర్ పెద్దలు జోక్యం చేసుకోవాలని కోరాడు.
టాలీవుడ్ లో టైటిల్ వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా అనేక సినిమాకు సంబంధించి టైటిల్ వార్స్ జరిగాయి. రామ్ పోతినేని 'ది వారియర్' సినిమా విషయంలోనూ సమస్య వచ్చింది. ఇప్పటికే 'వారియర్' అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకున్న కోనేరు హావీష్ దీనిపై అభ్యంతరం తెలిపారు. దీంతో టైటిల్ లో అదనపు 'R' ను జోడించి 'The Warriorr' గా మార్చారు.
ఇటీవల వచ్చిన 'గాడ్ ఫాదర్' టైటిల్ పై కూడా అభ్యంతరాలు వచ్చాయి. హాలీవుడ్ లోని అత్యుత్తమ క్లాసిక్ లలో ఒకటైన 'గాడ్ ఫాదర్' టైటిల్ ను ఉపయోగించినందుకు పారామౌంట్ కంపెనీ లీగల్ నోటీసును అందజేసింది. దీంతో హిందీలో 'మెగాస్టార్ గాడ్ ఫాదర్' అని.. ఇంగ్లీష్ లో 'మెగాస్టార్153 #గాడ్ ఫాదర్' అని మార్చి, విదేశీ కంపెనీ నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నారు.
ఇప్పుడు 'హంట్' టైటిల్ పైనా వివాదం ఏర్పడింది. ఇది 'ముంబై పోలీస్' అనే మలయాళ చిత్రానికి రీమేక్ అనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఇందులో సుధీర్ బాబు ఒక యాక్షన్ ప్యాక్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. 'ప్రేమిస్తే' భరత్ - సీనియర్ నటుడు శ్రీకాంత్ మేకా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆలోపు టైటిల్ వివాదాన్ని ఎలా తేల్చుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.