Begin typing your search above and press return to search.
మల్టీస్టారర్ కా బాప్ః ఒకే సినిమాలో ఇండస్ట్రీ మొత్తం..నటించబోతున్న 140 మంది స్టార్స్!
By: Tupaki Desk | 8 Feb 2021 12:30 AM GMTతమ స్టార్ హీరో సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అదే స్థాయి ఉన్న మరోస్టార్ తో మల్టీస్టార్ మూవీ చేస్తే..? వారిద్దరి ఫ్యాన్స్ కు పూనకాలే! అలాంటిది.. సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిసి ఒకే సినిమాలో నటిస్తే..? ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో.. వెండితెర కండీషన్ ఏంటో మీరే ఊహించుకోండి. నమ్మశక్యంగా కాకపోయినా.. ఇది వాస్తవం. త్వరలోనే కార్యరూపం దాల్చబోతోందీ అద్భుతం!
మలయాళ చిత్ర పరిశ్రమంలో ఈ అనితరసాధ్యమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది! మోలీవుడ్ అగ్ర హీరోలైన మోహన్‌లాల్, మమ్ముట్టి ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఇదే సినిమాలో మిగిలిన స్టార్స్ అందరూ నటిస్తున్నారు. అయితే.. ఇంత మంది కలిసి నటిస్తున్నారు కాబట్టి.. ఇదేదో భుజాల మీద చేతులు వేసుకొని పాటలు పాడుకునే ఫ్యామిలీ డ్రామా అనుకుంటే ప్లగ్గులో వేలెట్టినట్టే. ఇదో ఆసక్తి కరమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం!
మరి, ఇంత మంది కలిసి ఎందుకు నటిస్తున్నారనేగా మీ సందేహం..? చిత్ర పరిశ్రమలోని కార్మికులను ఆదుకునేందుకోసం ఈ సినిమాలో నటిస్తున్నారు మలయాళ స్టార్స్. కోవిడ్ సమయంలో యావత్ సినీ ఇండస్ట్రీ ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొందో అందరికీ తెలిసిందే. చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. వారిని ఆదుకునేందుకే సినీపరిశ్రమ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో వర్క్ చేసే కార్మికులకు పని కల్పించడంతో పాటు.. సినిమా థియేట్రికల్ రైట్స్, రన్, ఇతర రైట్స్ ద్వారా వచ్చే డబ్బులు మొత్తం సినీ కార్మికులకు అందించాలని కేరళ సినీ ఇండస్ట్రీ ‘అమ్మ’ నిర్ణయించింది. ఈ నెవ్వర్ బిఫోర్ చిత్రానికి ప్రియదర్శన్, రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. కాగా.. 2008లో మలయాళ అగ్రహీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి ట్వంటీ: 20 అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఈ చిత్రం కోసం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారీ హీరోలు. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.