Begin typing your search above and press return to search.

ధనుష్ హాలీవుడ్ సినిమా పోస్టర్ చూశారా?

By:  Tupaki Desk   |   2 Nov 2017 4:52 AM GMT
ధనుష్ హాలీవుడ్ సినిమా పోస్టర్ చూశారా?
X

కోలీవుడ్ లో ప్రస్తుతం నటనతోనే బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆ హీరో ధనుష్ ఒక్కడే అని చెప్పాలి. యాక్టింగ్ లో ప్రేక్షకుల నుండి మాస్టర్ డిగ్రీ పొందిన ఈ హీరో రజినీకాంత్ అల్లుడైనా కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నేషనల్ అవార్డును కూడా పొందిన ధనుష్ బాలీవుడ్ లో కూడా సినిమాను తీసి హిట్ అందుకున్నాడు.

అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా హాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. గత కొంత కాలంగా ఈ వార్తలు వచ్చినా కొందరు రూమర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూస్తే నిజమని నమ్మాల్సిందే. ది ఎక్సట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్ అనే సినిమాతో త్వరలోనే రాబోతున్నాడు ఈ సౌత్ హీరో. ధనుష్ ఈ సినిమాలో ఇండియాకు చెందిన ఒక కళాకారుడిగా 'అజా' అనే పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇదే పేరుతో ఉన్న ప్రముఖ నవల ఆధారంగా కెన్ స్కాట్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటీనటులు కిల్ బిల్ నటి ఉమా థుర్మాన్ మరియు పెర్సీ జాక్సన్ లు నటిస్తున్నారు. నవంబర్ 1న అమెరికన్ ఫిల్మ్ మార్కెట్లో సినిమా తొలి ప్రమోషనల్ టీజర్ ను ప్రదర్శించగా హాలీవుడ్ చెందిన కొందరు ప్రముఖులు ఈ సినిమా హక్కులను పొందారు.