Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఫకీర్ గా ధనుష్
By: Tupaki Desk | 11 Feb 2018 7:28 AM GMTరెగ్యులర్ సినిమాలు చేస్తూనే ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు ముందుండే తమిళ హీరో ధనుష్ ఈసారి మాత్రం పెద్ద సాహసమే చేసాడు. ది ఎక్స్ ట్రాడినరి జర్నీ అఫ్ ది ఫకీర్ పేరుతో రూపొందుతున్న ఇంగ్లీష్ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఫ్రెంచ్ బాషలో రూపొందుతున్న ఈ మూవీని మల్టీ లాంగ్వేజ్ లో తీస్తున్నారు. రోమైన్ ప్యూర్టోలాస్ రచించిన పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు దర్శకుడు కెన్ స్కాట్. ట్రైలర్ ఆద్యంతం తాను ఈ సినిమా తీయడానికి ఎంత కష్టపడింది వాయిస్ ఓవర్ లో వివరించిన కెన్ సినిమాలోని సన్నివేశాలతో పాటు వర్కింగ్ సీన్స్ ని జత చేయటం విశేషం. సోలో హీరోగా ధనుష్ కి ఇది మొట్టమొదటి హాలీవుడ్ సినిమా. ధనుష్ - బెజో - బర్కద్ - ఎరిన్ - జుగ్ నాట్ - అబెల్ జాఫ్రీ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా డబ్బింగ్ రూపంలో భారతీయ బాషల్లోకి కూడా రానుంది.
కథ మాత్రం ఇండియాలో జరిగినట్టే ఉండటం దీని విశేషం. అజాతశత్రు ఒగాష్ రాథోడ్ అనే పకిర్ పాత్రలో ధనుష్ కనిపిస్తాడు. తన వ్యక్తిగత లక్ష్యం కోసం పారిస్ వెళ్ళిన ఫకీర్ అక్కడ మేరీని చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత అనుకోకుండా ప్రపంచవ్యప్తంగా సాహస పర్యటనలు చేయాల్సి వస్తుంది. అతీత శక్తులతో మంచి కామెడీని ఇందులో చొప్పించిన దర్శకుడు కెన్ ధనుష్ నటనని ఆకాశానికెత్తుతున్నాడు. మే 30న సోనీ సంస్థ ద్వారా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు 20 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఫకీర్ సినిమాలో ధనుష్ తన మల్టీ టాలెంట్స్ చూపించాడు. సౌత్ ఇండియన్ హీరో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న ఇంగ్లీష్ మూవీలో నటించడం కొత్తే. బాలీవుడ్ తారలు హాలీవుడ్ లో నటించడం కొత్తేమి కాదు కాని తెలుగు హీరోలకు కూడా అందని అవకాశం ధనుష్ కు దక్కడం విశేషమే.