Begin typing your search above and press return to search.

ఏజెంట్ ఫేట్ డిసైడ్ చేసేది అతనొక్కడే..!

By:  Tupaki Desk   |   18 Aug 2021 3:30 AM GMT
ఏజెంట్ ఫేట్ డిసైడ్ చేసేది అతనొక్కడే..!
X
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ''ఏజెంట్''. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇన్నాళ్లూ లవర్‌ బాయ్‌ పాత్రలు చేసిన అక్కినేని వారసుడు.. ఈ సినిమా కోసం సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ షాక్ కి గురయ్యారు. భారీ వర్కౌట్స్ చేసి అఖిల్ రెడీ చేసిన కండలు తిరిగిన దేహాన్ని చూసి.. అందరూ వావ్ అన్నారు. ఈ సినిమాతో అఖిల్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడాని అక్కినేని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

'ఏజెంట్' చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. సురేందర్ రెడ్డి - వక్కంతం కాంబోలో ఇప్పటికే అనేక సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వంశీ డైరెక్టర్ అయిన తర్వాత రచయితగా పని చేస్తున్న సినిమా ఇది. కాకపోతే వ‌క్కంతం వంశీ స్పై త‌ర‌హా క‌థ‌లు రాయ‌డంలో పెద్ద ఎక్స్ ప‌ర్ట్ కాదు. ఇంతకముందు అలాంటి స్టోరీలు రాయలేదు. అలానే దర్శకుడిగా చేసిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా పెద్ద‌గా వ‌ర్క్ అవుట్ అవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో సురేంద‌ర్ రెడ్డి - అఖిల్ కాంబోకి వ‌క్కంతం ఇచ్చే క‌థ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డైరెక్టర్ గా సురేంద‌ర్ రెడ్డి మంచి ఫామ్ లోనే ఉన్నా.. వ‌క్కంతం వంశీ రాసే క‌థ‌ని బ‌ట్టే 'ఏజెంట్' ఫేట్ డిసైడ్ అయి ఉంటుంది. ఇదే అఖిల్ అక్కినేని కెరీర్ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. 'అఖిల్' సినిమా తర్వాత యువ హీరో అన్నీ లవ్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఫ్యాన్స్ మాత్రం అఖిల్ మంచి యాక్షన్ హీరోగా నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వక్కంతం చెప్పిన 'ఏజెంట్' కథని ఎంచుకున్నాడు అఖిల్. మరి దీంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

కాగా, ''ఏజెంట్'' చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మరియు సరెండర్‌2సినిమా బ్యానర్స్ పై రూపొందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర - సురేందర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'ఏజెంట్' చిత్రాన్ని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.