Begin typing your search above and press return to search.
'బాహుబలి 2' ని బీట్ చేస్తుందా..?
By: Tupaki Desk | 28 March 2022 11:33 AM GMTదర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతోంది. తొలి రోజు 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా.. ఓపెనింగ్ వీకెండ్ లో అదే జోరు చూపించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో RRR అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది.
భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామాగా పేర్కొనబడిన RRR చిత్రం యూఎస్ఏలో 1200 లొకేషన్లలో ప్రదర్శించబడింది. ప్రీమియర్స్ తో పాటు తొలి రోజు వసూళ్ళు 5 మిలియన్ల మార్కును దాటేశాయి. ట్రేడ్ సర్కిల్స్ లెక్కల ప్రకారం, ఫస్ట్ వీకెండ్ లో $9.25 మిలియన్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 'బాహుబలి: ది బిగినింగ్' లైఫ్ టైం గ్రాస్ ని అధిగమించిందని తెలుస్తోంది.
అయితే 'బాహుబలి 2' ని బీట్ చేయడంలో మాత్రం విఫలమైంది. 'బాహుబలి 1' అమెరికాలో లాంగ్ రన్ లో $6.9 మిలియన్ల గ్రాస్ వసూలు చేయగలిగింది. ఇప్పుడు RRR సినిమా మొదటి వారాంతంలోనే ఆ నంబర్ ని క్రాస్ చేసింది. మరోవైపు బాహుబలి 2 సినిమా 425 లొకేషన్లలో ప్రదర్శించబడి మొదటి వారాంతంలో $10.4 మిలియన్ల కలెక్షన్లు అందుకుంది.
ఇక 'బాహుబలి: ది కన్‌క్లూజన్' మూవీ యుఎస్ లో లాంగ్ టైంలో $20 మిలియన్ల వసూళ్ళు సాధించి టాప్ పొజిషన్ లో ఉంది. RRR ఫైనల్ రన్ ముగిసేలోగా 'బాహుబలి 2' కలెక్షన్లను దాటుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-3 ఇండియన్ సినిమాలు తెలుగు నుంచి వచ్చినవే. అంతేకాదు అవి రాజమౌళి తెరకెక్కించిన సినిమాలే కావడం విశేషం.
కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు - కొమరం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా రూపొందింది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
అలియా భట్ - సముద్రఖని - అజయ్ దేవగన్ - రే స్టీవెన్సన్ - అలిసన్ డూడీ - ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో కనిపించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.