Begin typing your search above and press return to search.

సింగిల్ గా సినిమా చూసేయండి..!

By:  Tupaki Desk   |   10 Jan 2021 10:32 AM GMT
సింగిల్ గా సినిమా చూసేయండి..!
X
స్వీడన్​లో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఫిల్మ్​ ఫెస్టివెల్​ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఫిల్మ్​ ఫెస్టివల్​ కాస్త విభిన్నంగా సాగనున్నట్టు సమాచారం. మామూలుగా ఫిల్మ్​ ఫెస్టివల్ అంటే.. సినిమా హీరోలు, నిర్మాతలు, దర్శకులు, టెక్నికల్​ సిబ్బందితో హడావుడిగా ఉంటుంది. కానీ ఈ సారి కరోనా నేపథ్యంలో కాస్త విభిన్నంగా ఫిల్మ్​ ఫెస్టివల్​ సాగనున్నది. సినిమాలు ప్రదర్శిస్తారు. కానీ అక్కడ కేవలం ఒక్కరు మాత్రమే కూర్చొని చూడాలి. మధ్యమధ్యలో ఆ సినిమాకు చెందిన దర్శకులు, ఆర్టిస్టులు ఆన్​లైన్​ లైవ్​లో మీతో మాట్లాడతారు. అయితే సినిమాకు చూసే ప్రేక్షకులను ఫిల్మ్​ ఫెస్టివల్​ నిర్మాతలు ఎంపిక చేస్తారు.

స్వీడన్​లోని ఎర్తెబోజియేలో ఈ ఏడాది ఫిల్మ్​ ఫెస్టివల్​ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఉత్సవాలన్నీ ఎర్తెబోజియేకు సమీపంలోని పేటర్​ నోస్టర్​ అనే దీవిలో సినిమాల స్క్రినింగ్​లను ఏర్పాటు చేశారు. మొత్తం 60 చిత్రాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. అయితే ఈ ఏడాది సినిమాలు ప్రదర్శిస్తారు కానీ ప్రేక్షకులు ఉండరు.. కానీ స్క్రీన్‌కి ఒక్క ప్రేక్షకుడిని అనుమతించారు. ఈ సినిమాలను చూసే వాళ్లను కూడా ఫిల్మ్​ ఫెస్టివల్​ నిర్వాహకులు ఎంపికచేయనున్నారు.

వాళ్లు ఒక వారం రోజుల పాటు తమ బంధువులు. చుట్టాలను వదిలిపెట్టి.. మొబైల్​ ఫోన్లను వదిలిపెట్టి ఇక్కడ సినిమా చూడాల్సి ఉంటుంది. మామూలుగా ఫిల్మ్​ ఫెస్టివల్స్​ అంటే గందరగోళంగా, హడావుడిగా ఉంటుంది. ఇక్కడికి ప్రదర్శించే సినిమాలు, ఆహ్వానితులుగా ఎంపికైన సినిమా టెక్నిషియన్స్​ అందరికీ ప్రత్యే గుర్తింపు ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా చిత్రోత్సవాలు జరుగుతున్నాయి. కేవలం ఆహ్వానితులంతా ఆన్​లైన్లోనే పాల్గొనాలి. చిత్రాలను ప్రదర్శిస్తారు. కానీ ఒక్క షో కు ఒక్క ప్రేక్షకుడిని మాత్రమే ఎంపిక చేస్తారు. కరోనా ఎఫెక్ట్ తో ఇలా ఐసోలేటెడ్​ థియేటర్లను ఏర్పాటు చేశారు.