Begin typing your search above and press return to search.
ప్రభాస్ 20 మేకర్స్ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణాలు ఇవే...?
By: Tupaki Desk | 17 Jun 2020 5:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లో 20వ చిత్రాన్ని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'సాహో' వంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. దీనికి తగ్గట్టే పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న చిత్రం కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది.
అయితే ఈ జాప్యం వెనుకున్న అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాకి సంబంధించిన సగానికి పైగా షూటింగ్ యూరప్ లో జరిగింది. అయితే అక్కడ జరిగిన షూటింగ్ లో దాదాపు ప్రతి ఫ్రేమ్ కి చాలా డిజిటల్ వర్క్ చేయాల్సి ఉందట. అంటే గ్రాఫిక్స్ చాలా జోడించాలి. అలానే చాలా వరకు ఆ సీన్స్ యాక్షన్ సన్నివేశాలు అవ్వడం.. వాటిలో ప్రభాస్ ఫ్రోఫైల్స్ సరిగ్గా దొర్కకపోవడమే మేకర్స్ ఎలాంటి ప్రమోషన్ మెటీరియల్ ఇవ్వకపోవడానికి అసలు రీజన్ అని సమాచారం. కాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ షెడ్యూల్ వేసి కొన్ని కీలక సన్నివేశాలు తీయడానికి టీమ్ ప్లాన్ చేసినప్పటికీ కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అలానే ఈ సినిమాకి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ చేయలంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు అవాస్తవమట. ఈ సినిమాలో కూడా 'సాహో' మాదిరిగానే ఒక్కో పాటని ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తున్నారట. అలానే నేపథ్య సంగీతానికి జిబ్రాన్ ని తీసుకున్నారట. అయితే ఆ డిటేల్స్ ముందే బయటపెట్టడానికి మేకర్స్ ఇష్టపడటంలేదట. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్' 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.