Begin typing your search above and press return to search.

బుల్లి తెర సీత 'సరోజిని' ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది

By:  Tupaki Desk   |   9 May 2020 9:10 AM GMT
బుల్లి తెర సీత సరోజిని ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది
X
1980లలో బుల్లి తెరపై సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన రామాయణ్‌ లో సీత పాత్ర పోషించిన నటి దీపికా చిఖలియా. దూరదర్శిన్‌ లో ప్రసారం అయిన రామయణ్‌ సీరియల్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. లాక్‌ డౌన్‌ కారణంగా ఇప్పుడు మళ్లీ ప్రసారం అవుతున్నా కూడా అత్యధిక రేటింగ్‌ ను దక్కించుకుంటుంది. రామాయణ్‌ లో సీతగా నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న నటి దీపికా చిఖలియా ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లింది. ఎంపీగా కూడా గెలిచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించింది.

చాలా కాలం తర్వాత దీపిక చిఖలియా కెమెరా ముందుకు రాబోతున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా సరోజిని నాయుడు పాత్రలో ఈమె నటించబోతుంది. బాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో బయోపిక్‌ లకు మంచి ఆధరణ లభిస్తున్న నేపథ్యంలో సరోజిని బయోపిక్‌ ను తెరకెక్కించేందుకు దర్శక ద్వయం ఆకాష్‌ నాయక్‌.. ధీరజ్‌ మిశ్రాలు సిద్దం అయ్యారు. ఈ చిత్రంను కాను భాయ్‌ పటేల్‌ నిర్మిస్తున్నారు.

సరోజిని నాయుడు పాత్రకు దీపిక చిఖలియా అయితేనే బాగుంటుందనే అభిప్రాయంతో ఆమెను ఒప్పించి మరీ ఈ సినిమాను చేస్తున్నారు. ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాని ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశారు. సరోజిని అనే టైటిల్‌ తో రూపొందుతున్న ఈ చిత్రంలో చిఖలియా లుక్‌ అందరిని ఆకట్టుకుంది. తప్పకుండా ఇది అన్ని భాషల్లో కూడా హిట్‌ అవుతుందనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.