Begin typing your search above and press return to search.

థియేట‌ర్లు తెరిస్తే రిలీజ‌య్యే మొట్ట మొద‌టి సినిమా

By:  Tupaki Desk   |   9 July 2021 6:30 AM GMT
థియేట‌ర్లు తెరిస్తే రిలీజ‌య్యే మొట్ట మొద‌టి సినిమా
X
ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీ.. తెలంగాణ‌లో 100శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌ను తెరుచుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాయి. కానీ ఇంకా థియేట‌ర్ య‌జ‌మానుల్లోనే ర‌క‌ర‌కాల సందేహాలు. లాక్ డౌన్ ల వ‌ల్ల థియేట‌ర్ల రంగం తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని త‌మ‌కు ప్ర‌భుత్వాలు స‌హాయం చేయాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు ఎగ్జిబిట‌ర్లు. తాజాగా తెలంగాణ ఛాంబ‌ర్ త‌ర‌పున కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఏపీ ప్ర‌భుత్వానికి కూడా లేఖ‌లు రాయ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ థియేట‌ర్ల‌ను తిరిగి తెర‌వ‌క‌పోవ‌డానికి కార‌ణం త‌మ న‌ష్టాన్ని క‌ష్టాన్ని ప్ర‌భుత్వాల‌కు విన్న‌వించాల‌నే ఆలోచ‌నే అని అర్థ‌మ‌వుతోంది.

ఒక‌వేళ థియేట‌ర్లు తెరిస్తే రిలీజ‌య్యే మొట్ట‌మొద‌టి పెద్ద సినిమా ఏదీ? అంటే.. నాని న‌టించిన `టక్ జగదీష్` అని చెబుతున్నారు. గత నెలలో తెలంగాణ ప్రభుత్వం అన్ని కోవిడ్ -19 లాక్ డౌన్ పరిమితులను తొలగించి థియేటర్లను తిరిగి తెరవడానికి మార్గం సుగమం చేసింది. ఇంత‌లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యాభై శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లకు అనుమతించింది. ప్రస్తుతం జీవోని స‌వ‌రించారు. ఏదేమైనా థియేట్రిక‌ల్ బిజినెస్ తిరిగి ట్రాక్ లోకి రావాల‌నే అంతా ఆకాంక్షిస్తున్నారు. నిర్మాత‌లు పంపిణీదారులు ఎగ్జిబిట‌ర్లు బావుంటేనే ఈ రంగంలో ఉపాధి నిల‌బ‌డుతుంది. థియేట‌ర్ రంగం కుదేలైతే చాలా వ‌ర‌కూ ఉపాధి క‌రువ‌వుతుంది. కానీ అలా జ‌ర‌గ‌కూడ‌దు.

పలువురు నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలని ఓటీటీల‌కు అమ్మ‌కుండా వేచి చూస్తున్న‌ది ఇందుకే. పంపిణీదారులు ఎగ్జిబిటర్లు థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌కు వేచి చూడాల‌ని.. ఓటీటీ రిలీజ్ ల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ఛాంబ‌ర్ ఓ స‌ర్క్యుల‌ర్ ని జారీ చేయ‌డం విశేషం.

ఇక ఇలాంటి ప‌రిస్థితిలోనూ థియేట‌ర్లు ఓపెన్ చేస్తే త‌న సినిమాని రిలీజ్ చేసేందుకు నేచురల్ స్టార్ నాని సిద్ధంగా ఉన్నారు. అత‌డు న‌టించిన‌ టక్ జగదీష్ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో మాత్ర‌మే రిలీజ్ చేయ‌నున్నారు. నిజానికి సెకండ్ వేవ్ ప్రారంభం కాక‌ముందే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న మొట్ట‌ మొదటి భారీ చిత్రం ఇదే అవుతుంద‌ని అంచ‌నా. ట‌క్ జ‌గ‌దీష్ అన్నిప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు టీజ‌ర్లు అన్నిటికీ చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. పాట‌లు ఆక‌ట్టుకున్నాయి.

నాని - శివ నిర్వాణ విజయవంతమైన కలయికపైనా భారీ అంచ‌నాలున్నాయి. నిన్ను కోరి త‌ర్వాత ఈ జోడీ కాస్త మాస్ యాక్ష‌న్ సినిమాని ట్రై చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. నాని స‌ర‌స‌న ఈ చిత్రంలో రీతు వ‌ర్మ క‌థానాయిక‌గా న‌టించింది. గ‌త ఏడాది సాయి ధ‌ర‌మ్ థియేట‌ర్ల‌ను తెరిపించ‌గా.. ఈసారి నానీ థియేట‌ర్ల‌ను రీఓపెన్ చేయించ‌డానికి సిద్ధ‌మ‌వ్వ‌డం ఆస‌క్తిక‌రం.

నాని సినిమా రిలీజ‌య్యాక .. త‌దుప‌రి రానా న‌టించిన విరాట‌ప‌ర్వం కూడా రిలీజ్ కి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆచార్య‌- పుష్ప‌-కేజీఎఫ్ 2 -నార‌ప్ప ఇలా అన్నీ భారీ చిత్రాలు థియేట్రిక‌ల్ రిలీజ్ ల కోసం వేచి చూస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని అక్టోబ‌ర్ లో య‌థావిధిగా తాము ప్ర‌క‌టించిన రిలీజ్ తేదీకే తేవాల‌ని జ‌క్క‌న్న టీమ్ శ్ర‌మిస్తోంద‌ట‌. అందుకే చిత్ర‌బృందం డెడ్ లైన్స్ ప్ర‌కారం ప‌ని చేస్తోంది. అలాగే రిలీజ్ తేదీ మార్పు పైనా ఏ విష‌య‌మూ ప్ర‌క‌టించ‌లేదు. ఇక ఏడాది ఆరంభంలో ఉప్పెన‌- జాతి ర‌త్నాలు - క్రాక్ లాంటి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్లు అయ్యాయి. మ‌ళ్లీ ఇప్పుడు గ్యాప్ త‌ర్వాత సినిమాల రిజల్ట్ ఎలా ఉండ‌నుందో వేచి చూడాల్సి ఉంటుంది.