Begin typing your search above and press return to search.

మహేష్‌ విడుదల చేసిన మొదటి పాన్ ఇండియా మ్యూజిక్‌ వీడియో

By:  Tupaki Desk   |   6 April 2022 7:55 AM GMT
మహేష్‌ విడుదల చేసిన మొదటి పాన్ ఇండియా మ్యూజిక్‌ వీడియో
X
ఈమద్య కాలంలో మ్యూజిక్‌ వీడియో లకు మంచి డిమాండ్ ఉంది. ఉత్తరాదిన భారీ ఎత్తున ఖర్చు చేస్తూ ఈ మ్యూజిక్ వీడియో లను రూపొందిస్తూ ఉన్నారు. సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు లో ఒకప్పుడు కేవలం ఫోక్‌ సాంగ్స్ మాత్రమే మ్యూజిక్ వీడియో లుగా వచ్చేవి. కాని ఇప్పుడు పలు రకాల మ్యూజిక్ వీడియో లు వస్తున్నాయి. ఎంతో మంది ప్రముఖ నటీ నటులు కూడా మ్యూజిక్ వీడియో లపై ఆసక్తి చూపిస్తున్నారు.

ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా ఒక ఉత్తరాది మ్యూజిక్ వీడియో లో మెరిసిన విషయం తెల్సిందే. ఇక గత కొన్ని రోజులుగా లాలీపాప్ అనే మ్యూజిక్ వీడియో గురించి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. 30 వెడ్స్ 21 వెబ్‌ సిరీస్ తో యూత్‌ లో మంచి గుర్తింపు దక్కించుకున్న అనన్య మరియు శేఖర్‌ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్‌ తో హీరోగా పరిచయం అయిన సుధాకర్ లు ప్రథాన పాత్రల్లో లాలీపాప్ అనే మ్యూజిక్ వీడియో రూపొందింది.

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ మ్యూజిక్ వీడియో గురించి జరుగుతున్న ప్రచారం.. ఇప్పటికే విడుదల అయిన ప్రోమోస్ తో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించగలిగింది. ఇక ఈ పాటను తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు రిలీజ్ చేయడం తో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్‌ చేతుల మీదుగా విడుదల అయిన ఈ మ్యూజిక్ వీడియో ఖచ్చితంగా కుమ్మేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

వినయ్‌ షన్ముఖ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మ్యూజిక్‌ వీడియోను మొదటి పాన్ ఇండియా మ్యూజిక్ వీడియో గా పేర్కొంటున్నారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ.. తమిళం.. కన్నడం మరియు మలయాళం లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

మొదటి పాన్ ఇండియా మ్యూజిక్ వీడియోను మహేష్‌ బాబు చేతుల మీదుగా విడుదల చేయించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ యూనిట్‌ సభ్యులు తెలియజేశారు.

మహేష్‌ బాబు సినిమాల విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. అతి త్వరలోనే ఆ సినిమా ను పూర్తి చేసి జూన్‌ నుండి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా ను మహేష్ బాబు పట్టాలు ఎక్కించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్‌ బాబు వచ్చే ఏడాది లో రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే.