Begin typing your search above and press return to search.

ఫ్లాప్ లు.. డిజాస్టర్‌ లు ఆయన్ను ఆపలేవు

By:  Tupaki Desk   |   12 July 2022 8:30 AM GMT
ఫ్లాప్ లు.. డిజాస్టర్‌ లు ఆయన్ను ఆపలేవు
X
గత రెండున్నర సంవత్సరాలుగా కరోనా వల్ల స్టార్ హీరోల్లో కొందరు కనీసం ఒక్క సినిమా ను కూడా విడుదల చేయలేక పోయారు.. కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలిగారు. కాని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మాత్రం ఈ కరోనా సమయంలోనే అరడజను సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

కరోనా ముందు వరకు అక్షయ్ కుమార్‌ సినిమా అంటే మినిమం వంద కోట్లు అన్నట్లుగా వసూళ్లు రాబట్టాయి. ఆ జోరుతోనే వరుసగా సినిమాలకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం కూడా ఈయన చేస్తున్న సినిమాల సంఖ్య ఆరు నుండి పది వరకు ఉన్నాయి. వాటిల్లో ఎన్ని హిట్ లు ఎన్ని ప్లాప్ లు అవుతాయో అనే అనుమానాలు ఇప్పటి నుండే వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఏడాదిలో బచ్చన్ పాండే మరియు సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా లతో అక్షయ్‌ కుమార్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమా ల యొక్క వసూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అత్యంత దారుణమైన వసూళ్లు ఆ సినిమాలకు నమోదు అయ్యాయి అనేది అందరికి తెల్సిందే. ఆ సినిమా లను ఫ్లాప్ లు అనడం కంటే డిజాస్టర్స్ అనడం బెటర్‌ అంటూ బాలీవుడ్ మీడియా పేర్కొనడం జరిగింది.

అంతకు ముందు కూడా ప్లాప్‌ లు పడ్డాయి.. అయినా అక్షయ్‌ కుమార్‌ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాల్లో ఏడు సినిమా లు షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఆ సినిమాలకు సంబంధించి రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్‌ వస్తూనే ఉంది.. బాలీవుడ్‌ లో అక్షయ్ కుమార్‌ సందడి కంటిన్యూ అవుతూనే ఉంది.

తాజాగా అక్షయ్ కుమార్‌ హీరోగా టిను సురేష్ దేశాయ్ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమా లో మైనింగ్ ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ పాత్ర లో అక్షయ్‌ కుమార్‌ కనిపించబోతున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. మైనింగ్ ఇంజనీర్ జస్వంత్ సింగ్ గిల్ లుక్‌ లో అక్షయ్ కుమార్‌ చాలా కూల్‌ అండ్‌ ఇంట్రెస్టింగ్‌ గా ఉన్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ సినిమా కు ఇంకా టైటిల్‌ ను ఖరారు చేయలేదు. త్వరలోనే టైటిల్‌ తో టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా జోరును చూస్తూ ఉంటే ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.