Begin typing your search above and press return to search.

మహేష్ తో పోకిరి చేయమని పూరికి చెప్పిందెవరు?

By:  Tupaki Desk   |   11 Aug 2019 1:30 AM GMT
మహేష్ తో పోకిరి చేయమని పూరికి చెప్పిందెవరు?
X
మహేష్ బాబుకు సంబంధించిన ప్రతి ఈవెంట్లో ఈమధ్య రెగ్యులర్ గా కనిపిస్తున్న వ్యక్తి డైరెక్టర్ మెహర్ రమేష్. ప్రస్తుతం మెహెర్ డైరెక్టర్ గా యాక్టివ్ గా లేరు. జూనియర్ ఎన్టీఆర్ తో 'కంత్రీ'..'శక్తి'.. వెంకటేష్ తో 'షాడో' లాంటి డిజాస్టర్లతో ఫేడ్ అవుట్ అయ్యాడు. కానీ తన కెరీర్ సంగతేమో కానీ మహేష్ బాబు కుటుంబంతో మాత్రం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మెహర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

మహేష్ బాబు కెరీర్ లో 'పోకిరి' ఎంత పెద్ద హిట్టో చెప్పనసవరం లేదు. మహేష్ ను ఒక్కసారిగా స్టార్ గా మార్చిన చిత్రమది. ఈ సినిమను మహేష్ తో చేయమని దర్శకుడు పూరి జగన్నాధ్ కు సూచించింది తనేనని మెహర్ చెప్పుకొచ్చాడు. మహేష్ సినిమా 'బాబీ' కి మెహర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడట. అంతే కాదు ఒక మహేష్ కు ఫ్రెండ్ పాత్రలో కూడా నటించాడు. 'పోకిరి' చేయమని సూచించడం ఒక్కటే కాదు.. మహేష్ - నమ్రతల వివాహానికి హాజరైంది మెహర్ రమేష్ ఒక్కరేనట.

ఇతర స్టార్ హీరోల వివాహాలకు భిన్నంగా మహేష్-నమ్రతల వివాహం అప్పట్లో చాలా సింపుల్ గా జరిగింది. మహేష్ ప్రేమ వివాహం కృష్ణగారికి ఇష్టంలేదని అప్పట్లో రూమర్లు కూడా వినిపించాయి. మరి ఆ విషయం నిజమో కాదో సన్నిహితులకు తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అయితే మహేష్ తో మెహర్ ఫ్రెండ్ షిప్ మాత్రం ఇప్పటిది కాదనే చెప్పుకోవాలి.