Begin typing your search above and press return to search.
బాలీవుడ్ కు `షంషేరా` అగ్నిపరీక్షేనా?
By: Tupaki Desk | 22 July 2022 8:24 AM GMTబాలీవుడ్ గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. కోట్లు కుమక్మరించి స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్టర్లతో చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పట్టుమని పది రోజులు కూడా నలబడలేక డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి. ఇదే సమయంలో సౌత్ సినిమాలు బక్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ బాలీవుడ్ స్టార్ లతో పాటు మేకర్స్ ని ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. `బాహుబలి` సిరీస్ చిత్రాల తరువాత ఆ స్థాయికి మించి RRR, కేజీఎఫ్ 2 చిత్రాలు దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించాయి.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. RRR కి మించి యష్ నటించిన `కేజీఎఫ్ 2` మరింత రచ్చ చేసి బాలీవుడ్ వర్గాలకు షాకిచ్చింది. దక్షిణాది సినిమాలు ఈ స్థాయిలో అక్కడ వసూళ్లని రాబడతాయని ఎవరూ ఊహించలేదు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ లెక్కలన్నీ మారిపోయాయి. సౌత్ తే పైచేయిగా మారింది. అయితే ఎలాగైనా `బాహుబలి` రేంజ్ సినిమాతో బాలీవుడ్ పరువు కాపాడు కోవాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వస్తున్న మూవీ `షంషేరా`. స్వాతంత్య్రానికి పూర్వం కథతో ఈ మూవీని తెరకెక్కించారు. రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీని కరణ్ మల్హోత్రా రూపొందించగా ఆదిత్య చోప్రా నిర్మించారు. బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకున్న ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ మూవీలో తొలి సారి రణ్ బీర్ కపూర్ టూ షేడ్స్ వున్న పాత్రల్లో తండ్రీ కొడుకులుగా నటించాడు. వాణీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సంజయ్ దత్ బ్యాడ్ మెన్.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ కు మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. దీంతో బాలీవుడ్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకుంది. 4350 స్క్రీన్ లలో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. సినిమాపై యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నారు. అయితే పీరియాడిక్ నేపథ్యంలో రూపొందిన అక్షయ్ కుమార్ మూవీ `సమ్రాట్ పృథ్వీరాజ్` బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో కొంత మంది `షంషేరా` పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ సినిమాకు కొత్త సమస్య పట్టుకుంది. బాలీవుడ్‌లో భారీ సినిమా విడుదలైనా నెట్టింట బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ ట్రోల్ చేయడం మొదలవుతూ వుంటుంది. శుక్రవారం విడుదలవుతున్న `షంషేరా`మూవీకి కూడా ఇప్పడు ఇదే ట్రోలింగ్ జరుగుతోంది. రెండు రోజుల ముందుగానే ఈ మూవీని బాయ్‌కాట్ చేయండి అంటూ నెటిజన్స్ ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. హిందుత్వ మద్దతు దారులతో పాటు సుశాంత్ రాజ్ పుత్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా ఏర్పడి బాలీవుడ్ సినిమాలని ట్రోల్ చేస్తున్నారు.
హిందుత్వకు వ్యతిరేకంగా సినిమాలు వస్తున్నాయని ఓ వర్గం ట్రోల్ చేస్తుంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ మాత్రం బాలీవుడ్ లో వున్న నెపోటిజమ్ వల్లే మా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి చెందాడని కామెంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా గతంలో ధోతీ ధరించి ఏ సినిమా చేయబోనని ప్రకటించడంతో ఇప్పుడు హిందుత్వ వర్గాలు రణ్ బీర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇన్ని వ్యతిరేకతల మధ్య విడుదలవుతున్న `షంషేరా` బాలీవుడ్ కు అగ్నిపరీక్షగా మారింది. భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తున్న ఈ మూవీ బాలీవుడ్ పరువుని కాపాడుతుందా? .. అంతా ఆశించినట్టుగానే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందా? అన్నది మరి కొన్ని గంటల్లోనే తేలనుంది.