Begin typing your search above and press return to search.
ది ఘోస్ట్ బిజినెస్.. ఈసారైనా టార్గెట్ ఫినిష్ చేస్తాడా?
By: Tupaki Desk | 3 Oct 2022 7:03 AM GMTఅక్కినేని నాగార్జున సోలోగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అయింది. ఆయన కొడుకుతో నటించిన చిత్రం బంగార్రాజు జస్ట్ బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చింది గాని థియేట్రికల్ గా పెద్దగా లాభాలు అయితే అందించలేదు.
ఇక ఇప్పుడు అందరి ఫోకస్ కూడా ది ఘోస్ట్ సినిమా పైనే ఉంది. ఈ సినిమాతో నాగార్జున అసలైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకొని మళ్ళీ తన మార్కెట్ ను పెంచుకోవాలని అనుకుంటున్నాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే ముందుగా ఈ సినిమా నైజాంలో 5.50 కోట్ల మేర దర పలికినట్లుగా టాక్ వస్తోంది. సీడెడ్ లో 2.50 కోట్ల వరకు బిజినెస్ చేసిన నాగార్జున సినిమా ఆంధ్ర మొత్తంలో ఎనిమిది కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ది ఘోస్ట్ సినిమా థియేట్రికల్ గా 16 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలియజేస్తున్నారు.
ఇక కర్ణాటకలో చాలా తక్కువగానే ఈ సినిమా బిజినెస్ చేసింది. అక్కడ 65 లక్షలకు మాత్రమే అమ్ముడైనట్లు టాక్. హిందీలో అలాగే రెస్టాఫ్ ఇండియాలో మొత్తంగా చూసుకుంటే 2 కోట్ల వ్యాల్యూ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో మాత్రం 2.5 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్ గా ది ఘోస్ట్ గోస్ట్ సినిమా 21.15 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే తప్పకుండా 22 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. ది గోస్ట్ ట్రైలర్ అయితే ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించింది.
అక్టోబర్ 5న విడుదలవుతున్న ఘోస్ట్ సినిమాకు పోటీగా మెగాస్టార్ గాడ్ ఫాదర్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ అయితే టాక్ ను బట్టి పెరిగే అవకాశం ఉంటుంది. మంచి టాప్ వస్తే నాగార్జున ఈ దసరా ఫెస్టివల్ లో భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందుకునే అవకాశం ఉంటుంది. మరి నాగార్జున ఈ టార్గెట్ ను ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.