Begin typing your search above and press return to search.
ది ఘోస్ట్ డే 1 కలెక్షన్స్.. ఇది ఊహించలేదు నాగ్!
By: Tupaki Desk | 6 Oct 2022 6:28 AM GMTదసరా బాక్సాఫీస్ ఫైట్ లో మెగాస్టార్ చిరంజీవి అలాగే అక్కినేని నాగార్జున ఇద్దరు కూడా ఒకేసారి రావడంతో రెండిట్లో ఏ సినిమా సక్సెస్ అవుతుంది అనే టాపిక్ పై సోషల్ మీడియాలో బాగానే చర్చ కొనసాగింది. ముఖ్యంగా గాడ్ ఫాదర్ రీమేక్ సినిమా అని ఆ సినిమాపై ఎవరు పెద్దగా ఆసక్తిగా లేరు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ఇక ఈ టాక్ అయితే నాగర్జున సినిమాకు బాగా హెల్ప్ అవుతుంది అని కూడా అందరూ ఊహించారు.
కానీ ది ఘోస్ట్ సినిమాలో కంటెంట్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో కలెక్షన్స్ అయితే మరి దారుణంగా తక్కువగా వచ్చాయి. అసలు నాగార్జున ఈ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాడు అని ఎవరు ఊహించలేదు.
ది ఘోస్ట్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఏరియాల షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజంలో 57 లక్షలు సీడెడ్ లో 24 లక్షలు ఉత్తరాంధ్ర 31 లక్షలు ఈస్ట్ లో 23 లక్షలు వెస్ట్ లో 8 లక్షలు గుంటూరులో 22 లక్షలు కృష్ణాలో 20 లక్షలు నెల్లూరులో 15 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే రెండు కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇక కర్ణాటక అలాగే మిగతా రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్ అయితే కేవలం 20 లక్షలు మాత్రమే వచ్చాయి.
యూఎస్ లో అయితే అతి దారుణంగా 25 లక్షల షేర్ దక్కింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ది ఘోస్ట్ సినిమా 2.45 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా 4.60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మొదటి రోజు ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం నిజంగా దారుణమనే చెప్పాలి. అది కూడా దసరా ఫెస్టివల్ లో గత చరిత్రలో అయితే ఇలాంటి తక్కువ స్థాయి ఓపెనింగ్స్ అయితే రాలేదు.
కానీ సినిమాకు మొదటి షోకే కొంత నెగిటివ్ టాక్ రావడంతో జనాలు ఆ తర్వాత షోలను పెద్దగా పట్టించుకోలేదు. మొత్తంగా ఈ సినిమా 21 కోట్ల బిజినెస్ చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి రావాలి అంటే మినిమం 19 కోట్ల వరకు ఇంకా షేర్ కలెక్షన్స్ అందుకోవాలి. మరి ఇలాంటి టాక్ తో సినిమా వీకెండ్ లో ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.