Begin typing your search above and press return to search.
ది ఘోస్ట్ లో అదొక్కటి మిస్ అవ్వడం వల్లే...
By: Tupaki Desk | 8 Oct 2022 5:38 AM GMTఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ప్రేక్షకులు ది ఘోస్ట్ సినిమా యొక్క ఫలితంను తేల్చి పారేశారు. సినిమా గురించి ఎన్ని అంచనాలు పెట్టుకున్నా... ఎంతగా ఆశలు పెంచుకున్నా కూడా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రేక్షకులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి కనెక్ట్ అయితే భారీగా విజయం సాధించడం... కనెక్ట్ అవ్వకుంటే వదిలేయడం మనం చూస్తూనే ఉన్నాం.
ది ఘోస్ట్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు.
కానీ ఫలితం తారు మారు అయ్యిందనే చెప్పాలి. అదేంటి అద్భుతమైన గొప్ప యాక్షన్ సన్నివేశాలను మీ ముందు ఉంచాం.. నాగార్జున ను ఎంతో గొప్పగా చూపించాం అంటూ దర్శకుడు అనుకుంటూ ఉండవచ్చు.
కానీ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ విషయంలో మాత్రం దర్శకుడు లాజిక్ మిస్ అయ్యాడు. ఎంత గొప్ప యాక్షన్ సినిమా అయినా కాస్త ఎమోషనల్ సన్నివేశాలతో కనెక్ట్ అయ్యి ఉండాలి. కథలో ఎమోషన్ ఏదో ఒక విధంగా చూపించినప్పుడు మాత్రమే ప్రేక్షకులు ఆధరిస్తారు అంటూ చాలా సినిమాలను చూస్తే అర్థం అవుతుంది.
కామెడీ సినిమా అయినా యాక్షన్ సినిమా అయినా కథకు తగ్గట్లుగా ప్రేక్షకులు ఎమోషన్ తో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలా అయినప్పుడు మాత్రమే ప్రేక్షకుల్లో సినిమా పై పాజిటివ్ దృక్పదం అనేది ఏర్పడుతుంది.
కానీ ది ఘోస్ట్ విషయంలో అలాంటి పాజిటివిటీ క్రియేట్ కాలేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే సినిమా ఫలితం తల కిందులు అయ్యింది అంటూ రివ్యూలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.