Begin typing your search above and press return to search.
ఓపెనింగ్స్ కష్టమేనా?
By: Tupaki Desk | 3 Oct 2022 8:30 AM GMTకింగ్ నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్' మూవీతో దసరా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ మూవీలో కింగ్ నాగ్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని ప్రవీణ్ సత్తారు అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. చాలా రోజులు తరువాత నాగార్జున నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామా ఇది.
సొనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలోని కీలక పాత్రల్లో గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ నటించారు. ఈ ఇద్దరి ని కాపాడే క్రమంలో నాగ్ ఎదుర్కోన్న సవాళ్లేంటి? .. వారిని కాపాడటం కోసం తను ఎలాంటి యుద్ధం చేశాడు?.. ఇంతకీ వారికున్న ప్రమాదం ఏంటీ?.. అనే ఆసక్తికర అంశాల నేపథ్యంలో ఈ మూవీని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. నాగ్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా టెర్రిఫిక్ అవతార్ లో కనిపించబోతున్నారు.
టీజర్ రిలీజ్ నుంచే అంచనాల్ని పెంచేసిన ఈ మూవీకి ట్రైలర్ రిలీజ్ తరువాత మరింత బజ్ క్రియేట్ అయి సినిమాపై మరింత క్రేజ్ ని పెంచేసింది. ఇదిలా వుంటే ఈ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ అయినా .. కానీ భారీ ఓపెనింగ్స్ కష్టమే అనే టాక్ వినిఇపస్తోంది. నాగార్జున ఫ్యామిలీ హీరో. అంతే కాకుండా ఆయన నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు ఫెస్టివల్ సీజన్ లో విడుదలై మంచి విజయాల్ని సాధించాయి. అయితే ఈ సారి తన పంథాకు భిన్నంగా యాక్షన్ మూవీతో వస్తున్నారు.
అదే ప్రధాన మైనస్‌గా మారినట్టు తెలుస్తోంది. నాగ్ సినిమా అంటే ఫ్యామిలీస్ ఎగబడతారు. కానీ 'ది ఘోస్ట్' విషయంలో మాత్రం అది జరగడం లేదు. ప్రధాన నగరాల్లో ఈ మూవీకి ప్రీ బుకింగ్స్ లేకపోవడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది.
సాధారణంగా ఫెస్టివల్ సీజన్ లో ఎలాంటి సినిమాకైనా భారీ స్థాయిలో ప్రీ బుకింగ్స్ వుంటాయి. కానీ 'ది ఘోస్ట్' విషయంలో మాత్రం అది కనిపించడం లేదు. దానికి ప్రధాన కారణం సినిమా టైటిల్.
టైటిల్ కారణంగా ఈ మూవీ జనాల్లోకి పెద్దగా వెళ్లలేదని, ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేయలేకపోయిందనే వాదన వినిపిస్తోంది. ఆ కారణంగానే ఫ్యామిలీస్ ఈ మూవీపై ఆసక్తిని చూపించడం లేదట. గత కొంత కాలంగా నాగ్ ఫ్యామిలీస్ ని ఎట్రాక్ట్ చేయలేకపోతున్నారు. 'బంగార్రాజు' తో కొంత వరకు ఆకట్టుకున్నా తాజాగా యాక్షన్ సినిమాతో వస్తుండటంతో చాలా వరకు ఫ్యామిలీస్ 'ది ఘోస్ట్' మూవీపై ఆసక్తిని చూపించడం లేదని ప్రీ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కి మరో రెండు రోజులే వున్న నేపథ్యంలో ఆడియన్స్ మైండ్ సెట్ మారుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.