Begin typing your search above and press return to search.

ప్రభుత్వం చెప్పేసింది..ఆ సీన్లు షూట్ చేయద్దు

By:  Tupaki Desk   |   10 April 2021 7:40 AM GMT
ప్రభుత్వం చెప్పేసింది..ఆ  సీన్లు షూట్ చేయద్దు
X
హీరో లేదా హీరోయిన్ కు చెందిన ఓ ఉమ్మడి కుటుంబం. అందులో అమ్మ,నాన్నతో పాటు అక్కలు,బావలు, వదినలు, అన్నయ్యలు,తాతయ్య,ఇంట్లో పనోళ్లు ఇలా కుప్పలు తెప్పలుగా జనం ఉండి ఆప్యాయతలు ఒలికించే సీన్స్ కొద్ది రోజులు రాసుకోకపోవటమే మంచింది. ఎందుకంటే అంతమంది గుంపుగా ఏర్పడి షూట్ చేసే పరిస్దితిని ప్రభుత్వం వద్దంటోంది. అయినా సరే మేము చేసేస్తాం అంటే షూటింగ్ ప్లేస్ కు వచ్చి ఆపు చేసాస్తాం అంటున్నారు. ఎందుకలా అంటే రీజన్ మనకు తెలిసిందే.

కరోనా సెకండ్ వేవ్ లో విశ్వరూపం చూపిస్తోంది. దాంతో జనం,ప్రభుత్వాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎఫెక్ట్ సినీ పరిశ్రమపై బాగా పడుతోంది. రిలీజ్ లు, షూటింగ్ లపై ఆంక్షలను ప్రభుత్వం విధిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్దితి మరీ దారుణంగా ఉంది. ఏ రోజు ఎవరికి కరోనా ఎటాక్ అవుతుందో...టీమ్ లో ఎంతమందికు నెగిటివ్ వస్తోంది అనే భయాలుతో బ్రతుకుతున్నారు. కాకపోతే కార్మికలుకు ఇదే బ్రతుకు తెరవు అవటం, నిర్మాతలకు వడ్డీలు సమస్యలతో మధ్యలో షూటింగ్ లు ఆపు చేయలేని పరిస్దితి. ఈ క్రమంలో ప్రభుత్వం, సినీ ఎంప్లాయిస్ యూనియన్ కలిసి సరికొత్త షూటింగ్‌ రూల్స్ జారీ చేసింది. కేవలం రూల్స్ మాత్రమే పెట్టి ఊరుకోకుండా, వాటిని కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు ఓ సూపర్ వైజింగ్ టీమ్ ని కూడా ఏర్పాటుచేసింది.

ఇక ఈ రూల్స్ లో భాగంగా... షూటింగ్‌లో తీసుకోవాల్సిన ముందుస్తు జాగ్రత్తలు, అందరు మాస్క్ లు పెట్టుకోవటం, శానిటైజింగ్, గుంపులతో కూడిన సీన్స్ షూటింగ్ ఆపేయడం లాంటి కోవిడ్‌–19 షూటింగ్‌ రూల్స్ ని కచ్చితంగా అమలయ్యేలా ఈ టీమ్ చూస్తుంది. ముంబైలో సినిమావాళ్లు వరసపెట్టి కరోనాకు గురి అవ్వటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్షయ్‌ కుమార్,ఆలియా భట్, విక్కీ కౌశల్, భూమి ఫెడ్నేకర్‌ సహా అనేక మంది కరోనా బారిన పడడంతో ఇప్పటికే 'రామ్‌ సేతు', 'గంగూబాయ్‌ కాఠియావాడీ', 'మిస్టర్‌ లేలే' లాంటి అనేక సినిమా షూటింగులు ఆగిపోయాయి.

ఇందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేతో రీసెంట్ గా ముంబైకి చెందిన సినీ యూనియన్స్ వారు సమావేశమయ్యారు. గవర్నమెంట్ పెట్టే రూల్స్ ని, జాగ్రత్తలను ఫాలో అవతామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గుంపులు గుంపులుగా ఉంటే జనసమూహంతో కూడిన సీన్స్,ఎక్కవ మంది డ్యాన్సర్లున్న సాంగ్స్ ని ఆపేస్తున్నారు. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఎవరైనా రూల్స్ ని తప్పితే వారిపై కఠిన చర్య తీసుకుంటారు. అలాగే, ప్రతి శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా వీకెండ్ లాక్‌డౌన్‌ పెట్టడంతో మిగతా రోజుల్లో షూటింగ్ లు చేసుకోవాల్సిన సిట్యువేషన్.