Begin typing your search above and press return to search.
మీకు మీరే ఇవ్వగలిగే గొప్ప బహుమతి ధ్యానం!-సమంత అక్కినేని
By: Tupaki Desk | 14 March 2021 4:30 AM GMTఒత్తిడిని అధిగమించే పోరాటం మన మనస్సులో దాగుందని అన్నారు అక్కినేని కోడలు సమంత. ధ్యానం యోగాతోనే ఒత్తిళ్లను అధిగమించగలమని అన్నారు. మీకు మీరే ఇవ్వగలిగే గొప్ప బహుమతి ధ్యానం అని అన్నారు.
మహాశివరాత్రి ఫర్వదినాన సమంత అక్కినేని -లక్ష్మి మంచు- శిల్పా రెడ్డి ఇషా ఫౌండేషన్ లో ధ్యానం చేస్తున్న ఫోటో అభిమానుల్లో వైరల్ గా మారింది. నేటి ఆధునిక జీవనంలో ఒత్తిళ్లను అధిగమించాలంటే యోగా- ధ్యానం చాలా ముఖ్యమని అన్నారు.
`నా గుండా వెళుతున్న అధివాస్తవిక అనుభూతి`ని ధ్యానంతో చూడగలిగానని సమంత అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యానం ఎంతో ముఖ్యమని కూడా వ్యాఖ్యానించారు. ఈ ఫోటోని సమంతా అక్కినేని తన అభిమానులతో పంచుకుని ధ్యానం అవసరాన్ని తెలిపారు.
“నేను ధ్యానం చేయడానికి కూర్చున్న ప్రతిసారీ.. ఒక అధివాస్తవిక భావన నా గుండా వెళుతుంది. ఇది నేను ప్రతిదానిని చూసే విధానాన్ని మారుస్తుంది. వెనకబాటుకు గురి చేసే అంతర్గత ఆలోచనల నుండి నన్ను విముక్తి చేస్తుంది. ధ్యానం నా జీవితంలో ప్రశాంతత సానుకూలతను కలిగిస్తుంది” అని సామ్ వ్యాఖ్యానించారు.
ఆమె తన అభిమానులను ధ్యానం చేయమని .. యోగా ప్రయాణాన్ని ప్రారంభించమని ప్రోత్సహించారు. మీకు మీరే ఇవ్వగలిగే గొప్ప బహుమతి అని అన్నారు. “ఒత్తిడి నుండి విముక్తి పొందటానికి ధ్యానం మాత్రమే మార్గం. అన్ని ఒత్తిడి పోరాటం మనస్సులో ఉన్నాయి ” అని అన్నారు. సమంత ప్రస్తుతం శాకుంతలం చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగుకి రెడీ అవుతోంద.