Begin typing your search above and press return to search.
ఆ హీరో నిర్మాతగా కూడా బిజీ కానున్నాడట!!
By: Tupaki Desk | 4 July 2020 4:30 PM GMTదగ్గుబాటి రానా హీరోగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. చేతినిండా సినిమాలతో రానా విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. అయితే రానా హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం "అరణ్య". ప్రభు సాలొమోన్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ బాషలలో ఒకేసారి విడుదల కానుంది. నిజానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా చిత్రయూనిట్ వాయిదా వేయడం జరిగింది. కరోనా ఎఫెక్ట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా విడుదలను నిలిపివేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. కరోనా వైరస్ భయం భారతదేశ నలుమూలల పాకింది. దేశ జనమంతా కరోనా భయంతో ఏ పని చేయలేక పోతున్నారు. అందుకే దేశంలో కరోనా పరిస్థితులు సర్దుమనిగితే గాని సినిమాలు థియేటర్లలో సందడి చేసేలా లేవు.
ప్రస్తుతం పరిస్థితులలో థియేటర్లు తెరచుకొనేలా లేవు. జనాలు ఇంకా థియేటర్ల గురించి ఆలోచించకుండా ఓటిటిల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదిలా ఉండగా రానా నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీ కాబోతున్నాడు. ఇటీవలే రానా నిర్మించిన 'కృష్ణ అండ్ హిస్ లీల" ఓటిటిలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ఇక పై నటిస్తూనే రానా ఫుల్ టైం నిర్మాతగా మారనున్నాడట. అయితే రానా నిర్మించే సినిమాలు పిల్లల కోసమట. చైల్డ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని రానా అనిమేషన్ సినిమాలు సిద్ధం చేస్తున్నాడట. అవి ఈ ఏడాదిలో.. వచ్చే ఏడాది సందడి చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. రానా హీరోగా త్వరలో అయ్యప్పన్ కోషియం, గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప రూపొందనున్నాయి. ఇక ఈ ఏడాది చివరలో థియేటర్లు ఓపెన్ అయితే రానా అరణ్య, విరాటపర్వం సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాల పై రానా పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది.