Begin typing your search above and press return to search.

టైగర్ కాస్త 'లైగర్‌' అవ్వడానికి హీరో నత్తి కారణం!

By:  Tupaki Desk   |   8 Feb 2022 11:00 PM IST
టైగర్ కాస్త లైగర్‌ అవ్వడానికి హీరో నత్తి కారణం!
X
విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాధ్‌ ల కాంబోలో రూపొందుతున్న లైగర్‌ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటూ ఉంది. లైగర్ సినిమా ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్ ఈ సినిమా కు ఒక నిర్మాతగా వ్యవహరించడం వల్ల హిందీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ విషయంలో మొదటి నుండి చర్చ జరుగుతుంది. టైగర్ మరియు లయన్ ల క్రాస్ బ్రీడ్స్ ను లైగర్‌ అంటూ ఉంటారు.

అయితే ఈ సినిమా కు లైగర్ అని పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది అంటూ టైటిల్‌ ప్రకటించినప్పటి నుండి చాలా మంది చాలా రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో సినిమా కు ఆ టైటిల్‌ ను పూరి ఎందుకు పెట్టాడు అనే విషయమై ఒక లీక్ బయటకు వచ్చింది. అది ఎంత వరకు నిజమో కాని టైటిల్ కు జస్టిఫికేషన్‌ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు.

అసలు విషయానికి వస్తే సినిమాలో హీరో విజయ్ దేవరకొండకు నత్తి ఉంటుంది. అంటే అన్ని పదాలు అక్షరాలు కాకుండా కేవలం 'ట' అనే అక్షరం ఒక్కటి పలుకదు. ట అని పలకాలని అనుకున్నప్పుడు అది కాస్త ల మాదిరిగా వస్తుంది. అందుకే టైగర్‌ కాస్త లైగర్‌ అయ్యిందట. సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్న హీరో పేరు టైగర్‌ అయ్యి ఉంటుంది. అతడికి ట పలుకదు కనుక తనను తాను లైగర్ గా చెప్పుకుంటూ ఉంటాడు. లైగర్‌ కనుక ఎంత ఫవర్ ఫుల్‌ గా ఉంటుందో అంతకంటే పవర్‌ ఫుల్‌ గా విజయ్ దేవరకొండ లైగర్ పాత్రలో కనిపించబోతున్నాడట. అందుకే ఈ టైటిల్ సినిమాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ అంటున్నారు.

విజయ్‌ దేవరకొండ కు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్య పాండే నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో రియల్‌ స్టార్‌ మైక్ టైసన్‌ కూడా నటించాడు. ఆయన సన్నివేశాలు ఏంటీ.. హీరోకు ఆయనకు సంబంధం ఏంటీ.. కథలో ఆయన పాత్ర ఏంటీ అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందట. ఇస్మార్ట్‌ శంకర్ తర్వాత దర్శకుడు పూరి నుండి రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పూరి ఈ సినిమాను చేసినట్లుగా తెలుస్తోంది. తన సహజ పద్దతికి విరుద్దంగా ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ సమయంను పూరి తీసుకున్నాడు. పూరి సమయం తీసుకోవడం మాత్రమే కాకుండా కరోనా వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యింది. ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. షూటింగ్‌ పూర్తి చేసిన లైగర్‌ టీమ్‌ వెంటనే జనగణమన సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. పూరి జనగణమనను కూడా విజయ్ దేవరకొండతో చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. జనగణమన పూర్తి వివరాలు అధికారికంగా వెళ్లడి అవ్వాల్సి ఉంది.