Begin typing your search above and press return to search.
ఒక సినిమాతో ఫ్యూచర్ సినిమాలను చిక్కుల్లో పడేసుకున్న హీరో..!!
By: Tupaki Desk | 19 Jan 2021 9:30 AM GMTతమిళ ఇండస్ట్రీలో హీరో శింబు కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఇప్పటి వరకు తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన శింబు.. కేవలం ఒక సినిమా వలన తేరుకోలేని కష్టం మీదేసుకున్నాడు. కోరి తెచ్చుకుంటే అనుభవించాలి కదా అన్నట్లే ఉంది శింబు పరిస్థితి. కొన్నేళ్లుగా సినిమాలు చేయడం తగ్గించిన శింబు.. ఇటీవల ఈశ్వరన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఓ సినిమా విషయంలో తమిళ నిర్మాతల మండలి భవిష్యత్తులో శింబు సినిమాలకు ఎలాంటి సహాయం అందించరాదని తీర్మానించి షాక్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాత మైఖేల్ రాయప్పన్ కు శింబు చెల్లించాల్సిన బాకీని ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చిందట నిర్మాతల మండలి. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద తతంగమే నడిచిందట. శింబు కథానాయకుడుగా నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మించిన ‘అన్బానవన్ అరసాదవన్ అడంగాదవన్’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఆర్థిక కష్టాల టైంలో తానే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు శింబు. ఇక తనకిష్టం వచ్చినట్లు నిర్మించాడట.
తీరా సినిమా రిలీజై ప్లాప్ అయింది. దీంతో నిర్మాతకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో నిర్మాత, హీరో మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. ఓ సినిమాను ఫ్రీగా చేస్తానని ఒప్పుకున్నాడట శింబు. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. కానీ శింబు మాట తప్పి సినిమా చేయలేదు. దీంతో నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాతల మండలి.. ఇరువర్గాలను పిలిచి సంప్రదింపులు జరిపారు. నిర్మాతల మండలి చెప్పినదాన్ని బట్టి శింబు ఒక సినిమా ఫ్రీగా చేయాలి లేదా 6.60 కోట్లను మూడు దఫాలుగా ఆ నిర్మాతకు చెల్లించాలని మండలి తీర్మానించింది. ఈ ఒప్పందంపై శింబు సంతకం చేసాడట. కానీ శింబు ఒప్పందాన్ని ఉల్లఘించి.. ఏది చేయకపోవడంతో సీరియస్ అయిన నిర్మాతల మండలి శింబు భవిష్యత్తులో నటించే సినిమాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదనే నిర్ణయం ప్రకటించింది. ఈ దెబ్బకు శింబు తన కెరీర్ తానే చిక్కుల్లో పడిసుకుంటున్నాడని అర్ధమవుతుంది. చూడాలి మరి మళ్లీ ఏదైనా పరిష్కారం ఆలోచిస్తాడేమో..!!