Begin typing your search above and press return to search.
బిడ్డకు పాలు ఇస్తున్న వీడియో కావాలన్న నెటిజన్ కు హీరోయిన్ సమాధానం
By: Tupaki Desk | 20 July 2021 10:00 PM ISTబాలీవుడ్ హాట్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుని.. టీవీ షో ల ద్వారా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నేహా ధూపియా. పెళ్లి కాక ముందే గర్బవతి అయిన నేహా ఆ సమయంలో చర్చనీయాంశం అయ్యింది. గర్బవతి అని తెలిసిన తర్వాత పెళ్లికి సిద్దం అయ్యింది. మొదటి డెలవరీ తర్వాత కూడా ఆమె రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బుల్లి తెరపై కనిపిస్తూ వచ్చింది. తాజాగా మరోసారి నేహా ధూపియా తల్లి కాబోతున్నట్లుగా పేర్కొంది. నేహా భర్త అంగద్ బేడీ కరోనా రావడం తాను రెండవ సారి గర్బవతిని అవ్వడం ఒకే సారి జరిగిందని ఆమె సోషల్ మీడియా లో పేర్కొంది. రెండవ సారి తల్లి కాబోతున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉన్నట్లుగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పేర్కొన్నారు.
నేహా ధూపియా సోషల్ మీడియాలో సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి షేర్ చేసిన సమయంలో ఒక నెటిజన్ స్పందిస్తూ ఈసారి మీరు మీ సెకండ్ బేబీకి పాలు ఇస్తున్న వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నా అంటూ కామెంట్ పెట్టాడు. అతడి కామెంట్ పై నేహా తీవ్ర ఆగ్రహం వ్యంక్తం చేసింది. సహజంగా బ్యాడ్ కామెంట్స్ విషయంలో సెలబ్రెటీలు మౌనంగా ఉంటారు. నేహా కూడా బ్యాడ్ కామెంట్స్ ను ఎక్కువగా పట్టించుకోదు. బ్యాడ్ కామెంట్స్ ను డిలీట్ చేయడం లేదంటే ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా ఉండటం చేస్తుంది. కాని ఆమె ఈసారి కామెంట్ కు మాత్రం సీరియస్ గా స్పందించింది.
ఆ కామెంట్ చేసిన వ్యక్తి మాతృత్వంను కూడా కామంతో చూస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తింది. ఆ వీడియోను నేను షేర్ చేయనక్కర్లేదు. మీ అమ్మ లేదా అమ్మమ్మ ను అడిగినా వాళ్లు చూపిస్తారు అంది. ఇలాంటి వ్యక్తుల వల్ల మూడ్ అంతా చెడి పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. మంచి సందర్బంలో ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి వచ్చినందుకు ఇబ్బంది గా ఉందని.. అందుకే అతడి గురించి అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతో తాను అతడి కామెంట్ కు రిప్లై ఇచ్చాను అంది. బిడ్డకు పాలు ఇస్తూ ఉన్న వీడియోను షేర్ చేయమంటూ కామెంట్ చేసిన వ్యక్తిపై నెటిజన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.