Begin typing your search above and press return to search.

రీల్ విలన్ తో హీరోయిన్ పెళ్లికి రెఢీ

By:  Tupaki Desk   |   5 April 2022 4:30 AM GMT
రీల్ విలన్ తో హీరోయిన్ పెళ్లికి రెఢీ
X
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి కాకపోతే అదో వార్త. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎక్కువ మంది తమ మనసుకు నచ్చిన వాడిని పెళ్లాడటం చూస్తున్నాం. అయితే.. వీరి వివాహ బంధం ఎంతకాలం ఉంటుందన్న దానిపై స్పష్టత లేని పరిస్థితి.

సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రెండు పెళ్లిళ్లు తర్వాత.. మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవటం కూడా కనిపిస్తుంది. లివింగ్ రిలేషన్ లో ఉండటం.. అది కూడా ఏళ్ల తరబడి సాగే తమ బంధానికి పెళ్లి ముచ్చటనను ఎప్పటికో కానీ తీసుకురావటం చాలామంది విషయంలో చూస్తుంటాం. తాజాగా మరో సినిమా జంట పెళ్లికి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు.

కాకుంటే రీల్ లైఫ్ లో విలన్ క్యారెక్టర్లు వేసే నటుడికి.. హీరోయిన్ కు మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ ఇప్పుడు పెళ్లి పీటల మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది. గాయం.. చట్టం.. ఎవరైనా ఎప్పుడైనా తదితర చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన విమలా రామన్ కు.. డిటెక్టివ్.. చంద్రకళ.. వరుణ్ డాక్టర్ లాంటి మూవీల్లో విలనిజాన్ని పండించి..రీల్ లైఫ్ లో స్టైలీష్ విలన్ గా సుపరిచితులైన వినయ్ రాయ్ తో లవ్ మహా జోరుగా సాగుతుందన్న మాట వినిపిస్తోంది.

కొన్నేళ్లుగా సాగుతున్న వీరిద్దరి మధ్య డేటింగ్ కు పుల్ స్టాప్ పెట్టేసి.. పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారన్నది తాజా కబర్.

ఈ జంట కలిసి హాలిడేస్ ను ఎంజాయ్ చేసిన వైనం.. పలుమార్లు జంటగా మీడియా కంట పడటం తెలిసిందే. తామిద్దరి ఫోటోల్ని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకోవటం తెలిసిందే.

తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని సీరియస్ గా డిసైడ్ అయ్యారని.. త్వరలోనే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి మరో సినీ జంట పెళ్లి పీటలకు ఎక్కనుందన్న మాట.