Begin typing your search above and press return to search.

ఫ్యాన్‌ బికినీ ఫోటో అడిగితే షాక్ ఇచ్చిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   16 March 2022 5:30 AM GMT
ఫ్యాన్‌ బికినీ ఫోటో అడిగితే షాక్ ఇచ్చిన హీరోయిన్‌
X
బాలీవుడ్‌ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్ చేసే ఫోటోలు దేశ వ్యాప్తంగా పాపులర్ చేశాయి. హాట్‌ ఫోటోలు వీడియోలు షేర్ చేయడం ద్వారా కోట్లాది మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఇన్‌ స్టా లో రెగ్యులర్‌ గా అభిమానులతో చిట్‌ చాట్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా అభిమానులతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు ఒక చిట్‌ చాట్‌ లో వ్యవహరించిన తీరు.. ఫ్యాన్‌ కు ఇచ్చిన కౌంటర్ కు ప్రతి ఒక్కరు కూడా షాక్‌ అవుతున్నారు. కొందరు ఆమెను అభినందిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె తల పొగరు అంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి ఆమె చేసిన పని సోషల్‌ మీడియా లో వైరల్‌ అయ్యింది అనడంలో సందేహం లేదు. నెట్టింట ఆమె షేర్ చేసిన ఫోటో మరియు వీడియో ఏంటీ అనే విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది.

విషయానికి వస్తే దిశా పటానీ ఎప్పటిలాగే సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేసింది. ఏదైనా అడగండి అంటూ లైవ్‌ సెషన్ మొదలు పెట్టింది. అందులో చాలా మంది చాలా రకాల ప్రశ్నలు అడిగారు. ఆమె ప్రశ్నలకు సావదానంగా సమాధానం ఇస్తూ వచ్చింది. ఏదైనా అడగవచ్చు అంటూ ఆమె ముందే చెప్పడంతో కొందరు ఆకతాయిలు ఇష్టానుసారంగా పర్సనల్ క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టారు.

ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా అడిగిన ప్రశ్నలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఆ ప్రశ్నలు అడిగిన వారికి కౌంటర్ ఇచ్చింది. ముఖ్యంగా ఒక వ్యక్తి మీ బికినీ ఫోటో ను షేర్‌ చేయండి అంటూ విజ్ఞప్తి చేశాడు. అందుకు దిశా పటానీ స్కిప్‌ చేయకుండా ఫోటోను షేర్‌ చేసింది. కాని ఒక జంతువు కు బికినీ వేసి ఉన్న ఫోటో ను ఆమె షేర్‌ చేసి ఒక్క మాట మాట్లాడకుండా దిమ్మ తిరిగి పోయేలా అతడికి షాక్ ఇచ్చింది.

ఇలాంటి ప్రశ్నలు.. ఆకతాయి కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని ఎక్కువ శాతం మంది సెలబ్రెటీలు హీరోయిన్స్ పట్టించుకోరు. కాని ఈ అమ్మడు మాత్రం పట్టించుకోవడం మాత్రమే కాకుండా గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది.

ఆమె ఇలా గతంలో కూడా తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగిన వారికి ఇలాంటి కౌంటర్ లు ఇచ్చింది. అందుకే కొందరు ఆమెను కదిలించేందుకు భయపడుతారు. అయినా కూడా ఇంకా ఇలాంటి కామెంట్స్‌ వస్తున్నాయి. ఇకపై అయినా ఆమెకు ఇలాంటివి తప్పుతాయేమో చూడాలి.