Begin typing your search above and press return to search.

గర్బవతినంటూ అబద్దం చేప్పిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   13 July 2022 10:30 AM GMT
గర్బవతినంటూ అబద్దం చేప్పిన హీరోయిన్‌
X
సుధీర్ బాబు హీరోగా నటించిన ఎస్‌ ఎం ఎస్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రెజీనా. ఆ తర్వాత తెలుగు లో వరుసగా చిన్న సినిమాల్లో.. మీడియం రేంజ్ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న ఈ అమ్మడు కొన్ని సక్సెస్ లు దక్కించుకున్నా కొన్ని సినిమాలతో మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

హీరోయిన్‌ గా స్టార్‌ హీరోలతో నటించాలని ఎంతో ప్రయత్నించినా కూడా ప్రత్యేక సాంగ్స్‌ లేదా స్పెషల్‌ రోల్స్ తో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హీరోయిన్ గా ఈ మద్య కాలంలో టాలీవుడ్‌ లో పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో ఇతర భాషల్లో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఒక తెలుగు వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెజీనా ఆ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్ లో భాగంగా ఈటీవీలో ప్రసారం అవుతున్న అలీతో సరదాగా షో లో పాల్గొంది.

ఆ షో కు సంబంధించిన ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే. ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయిన తర్వాత మరిన్ని విషయాలను రెజీనా తెలియజేసింది.

అందులో భాగంగా తనకు ఇష్టమైన మిస్టీ దోయ్ స్వీట్‌ తినడం కోసం అబద్దం చెప్పినట్లుగా చెప్పుకొచ్చింది. ఒక రోజు రాత్రి 11 గంటల సమయంలో బయటకు వెళ్లి ఆ స్వీట్‌ ను కొనేందుకు ప్రయత్నించాను. అప్పటికే షాప్ వ్యక్తి షాప్ ను మూసి వేశాడు. వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. దాంతో తాను అతడిని మిస్టీ దోయ్ స్వీట్ కావాలని అడిగాను. అందుకు షాప్ కట్టేశామని చెప్పాడు.

నేను ప్రెగ్నెంట్‌.. నాకు ఇప్పుడు ఆ స్వీట్ తినాలని ఉందంటూ అబద్ధం చెప్పాను. నేను గర్భవతిని అంటూ చెప్పగానే ఆ వ్యక్తి మూసి వేసిన షాప్‌ ను మళ్లీ ఓపెన్ చేసి స్వీట్‌ ఇచ్చాడని.. అలా సదరు స్వీట్‌ కోసం గర్భవతిని అంటూ అబద్దం చెప్పానంటూ రెజీనా సరదాగా అప్పటి విషయాన్ని ఆలీతో సరదాగా చెప్పుకొచ్చింది.