Begin typing your search above and press return to search.
అమ్మతనంలో కమ్మతనం మిస్సయిన హీరోయిన్
By: Tupaki Desk | 2 Aug 2020 5:50 AM GMTఅమ్మతనంలో కమ్మతనం మిస్సయితే ఎలా? కెరీర్ లో ఎంత ఎత్తుకి ఎదిగినా ఆ మధురిమను మిస్సయ్యేందుకు ఆడవాళ్లు ఒప్పుకోరు. కానీ గ్లామర్ ప్రపంచంలో కథానాయికల సన్నివేశం అలా ఉంటుందా? నిరంతరం ఔట్ డోర్ షూటింగులతో వేగలేక బిజీ లైఫ్ పర్యవసానం గురించి ఆలోచించి పెళ్లికి దూరమవుతున్నారు. ముఖ్యంగా ఆ కీలక ఘట్టాన్ని లైఫ్ నుంచి డిలీట్ చేసే నాయికలు ఉన్నారు. కొందరు నాయికలు షూటింగులకు గ్యాప్ తీసుకుని మామ్ అయ్యాక తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు ప్రయత్నించి సక్సెసయ్యారు. ఈ రంగంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి.
బాలీవుడ్ టు హాలీవుడ్ కెరీర్ జర్నీ సాగించి అసాధారణ ఫాలోయింగ్ సంపాదించుకున్న పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా పరిస్థితి ఇలానే ఉంది. అమెరికన్ పాప్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన పీసీ ఏజ్ 38 ప్లస్. ఇంకా అమ్మతనంలో మధురిమల్ని మిస్సవుతూనే ఉంది. ప్రియానిక్ ఆనందమయ జీవితాన్ని ఆస్వాధిస్తున్నా ఆ ఒక్క లోటు అలానే ఉంది. అయితే ఇదంతా ప్రీప్లాన్డ్ అని పీసీ చెబుతోంది.
తాజాగా పీసీ ఫ్యామిలీ లైఫ్ .. పిల్లల్ని కనడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఎప్పుడు తల్లి కావాలనుకుంటోందో వివరాల్ని అందించింది. ``పిల్లలంటే చాలా ఇష్టం. నాకు పిల్లలు కావాలని ఉంది. అయితే ఎప్పుడు పిల్లలని కనాలన్న విషయంలో మాకు క్లారిటీ ఉంది. తప్పకుండా తల్లిని అవుతాను`` అని తెలిపింది. నా భర్త నా సర్వస్వం. తనతో ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇంతకుముందు నాకు తల్లిదండ్రులు తప్ప వేరే ప్రపంచం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు రోజు నిద్ర లేవగానే.. నాకంటూ ఓ ఇళ్లు ఉంది. నేను ఎంచుకున్న అత్యుత్తమ మార్గమిదని అనిపిస్తోందంటూ ఎమోషన్ కి గురైన పీసీ 12 ఏళ్ల వయసు నుంచి అమ్మతనం గురించి ఆలోచించేదట. ప్రియాంక చోప్రా ఇప్పటికే పలు హాలీవుడ్ ఓటీటీ కంపెనీలతో భారీ డీల్స్ కుదుర్చుకుంది. సూపర్ మేన్ తరహా రోల్ చేయనుంది. అలాగే భారీ హాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేయనుందని సమాచారం. బిజీ లైఫ్ ని ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసేందుకు పీసీ చాలానే ప్రయత్నిస్తోంది.