Begin typing your search above and press return to search.
బాయ్ ఫ్రెండ్ ని బయటపెట్టిన హీరోయిన్
By: Tupaki Desk | 15 April 2020 11:30 PM GMTఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు కుర్రకారు మనసు మనసు కొల్లగొట్టిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్. ముఖ్యంగా ఆ సినిమాతో పెద్ద సంచలనమే రేపింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. రీసెంట్ గా వెంకీ మామ సినిమా ఆడినా కూడా ఎందుకో క్రేజ్ దక్కలేదు. డిస్కో రాజా, RDX లవ్ లాంటి సినిమాలు ఇలా వచ్చి ప్లాప్ అయి అలా వెళ్లిపోయాయి. దాంతో ఎలాగైనా ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని మ్యాగ్జిమమ్ ట్రై చేస్తుంది పాయల్. ఇదిలా ఉండగా తాజాగా తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా పెద్ద షాక్ ఇచ్చింది.
పాయల్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. తన బాయ్ ఫ్రెండ్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేసి కుర్రాళ్ళ గుండెల్ని బద్దలుకొట్టింది. ఆయన పేరు సౌరభ్ డింగ్రా అని ముద్దుగా చెప్పింది పాయల్. సోషల్ మీడియాలో తన ప్రియుడిని పరిచయం చేసి అతడితో చెట్టపట్టాలేసుకుని భుజాలపై వాలిపోయిన ఫోటోలు పోస్ట్ చేసింది. ముంబైలో మోడల్ తో ప్రేమలో పడిపోయింది పాయల్. ఒకానొక సందర్భంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెబుతుంది. ఈ ఇద్దరూ కొన్ని రోజులుగా డేటింగ్ కూడా చేస్తున్నారట.
ముఖ్యంగా ఒకరంటే ఒకరికి ప్రాణం అనే లెవెల్ లో చెప్పేస్తుంది ఈ భామ. ఆ మధ్య సౌరభ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఇద్దరూ మంచి జోరులో ఉన్నపుడు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అయ్యాయి. అప్పుడే పనిలో పనిగా తన ప్రేమ విషయాన్ని కూడా చెప్పింది పాయల్. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పాయల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. తన లోపాలని ఇష్టపడే ఏకైక వ్యక్తి అంటూ తన ప్రియుడి పుట్టిన రోజు వేడుకలని ఆ మధ్య ఘనంగా జరిపింది అందాల పాయల్. భవిష్యత్తులో తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫ్యాన్స్ ని దేవదాసులను చేస్తోంది రాజపుత్ ఆర్డిఎక్స్ బాంబ్..